Audi New Launches In India: జర్మనీకి చెందిన విలాసవంతమైన కార్ల తయారీ సంస్థ ఆడీ ఏ4 సెడాన్ సెగ్మెంట్‌లో ఎంట్రీ లెవల్ కారును భారత్‌లో ప్రవేశపెట్టింది. దీని ధర రూ.39.99 లక్షలు(ఎక్స్‌షోరూం). గతంలో ఈ మోడల్‌లో ఏ4 ప్రీమియం, ఏ4 టెక్నాలజీ వచ్చాయి. వాటి ధర వరుసగా రూ.43.69 లక్షలు, రూ.47.61 లక్షలు. రెండు లీటర్ల పెట్రోల్ ఇంజిన్‌తో వస్తున్న కొత్త కారు 190 హెచ్‌పీ శక్తిని, 320 ఎన్‌ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.
కొత్త కారు విడుదల సందర్భంగా ఆడీ ఇండియా హెడ్ బల్బీర్ సింగ్ ధిల్లాన్ మాట్లాడుతూ.. జనవరిలో ఏ4 విడుదలైనప్పటి నుంచి భారీ ఆదరణ లభిస్తోందని తెలిపారు. తమ సంస్థ నుంచి వస్తున్న కార్లలో ఇదే అత్యధికంగా అమ్ముడవుతోందని పేర్కొన్నారు. తాజాగా విడుదల చేసిన మోడల్‌తో మరింత మంది వినియోగదారులు ఆడీవైపు మొగ్గుచూపుతారని ఆశాభావం వ్యక్తం చేశారు.
ఇవీ చూడండి: