ETV Bharat / business

ఏటీఎం లావాదేవీలు ఇక మరింత భారం

2022 జనవరి 1 నుంచి ఏటీఎం లావాదేవీలు మరింత భారం కానున్నాయి. నెలవారీ ఉచిత లావాదేవీలు ముగిశాక చేసే ప్రతి లావాదేవీపై ఖాతాదారులు రూ.21 చెల్లించాల్సి ఉంటుంది. ఏటీఎం కేంద్రాలు నెలకొల్పేందుకు, నిర్వహణకు వ్యయాలు పెరగడం, సాధారణ ఖర్చులకుగాను ఈమేరకు వినియోగదారు ఛార్జీలు పెంచుకునేందుకు బ్యాంకులకు అనుమతి ఇచ్చినట్లు ఆర్​బీఐ తెలిపింది.

atm charges increase news
ఏటీఎం ఛార్జీలు
author img

By

Published : Jun 11, 2021, 7:54 AM IST

వచ్చే ఏడాది జనవరి నుంచి ఏటీఎం లావాదేవీలు మరింత భారం కానున్నాయి. నెలవారీ ఉచితంగా అనుమతించిన వాటికి మించి చేసే నగదు, నగదేతర ఏటీఎం లావాదేవీలపై ఛార్జీలు పెంచుకునేందుకు రిజర్వు బ్యాంకు ఆఫ్​​ ఇండియా(ఆర్​బీఐ) బ్యాంకులకు అనుమతి ఇచ్చింది.

ఖర్చులు పెరగటం వల్లే..

2022 జనవరి 1 నుంచి నెలవారీ ఉచిత లావాదేవీలు ముగిశాక చేసే ప్రతి లావాదేవీపై ఖాతాదారులు రూ.21 చెల్లించాల్సి ఉంటుంది. ఇలాంటి లావాదేవీలపై ప్రస్తుతం వినియోగదారుల నుంచి బ్యాంకులు రూ.20 చొప్పున వసూలు చేస్తున్నాయి. ఏటీఎం కేంద్రాలు నెలకొల్పేందుకు-నిర్వహణకు వ్యయాలు పెరగడం, సాధారణ ఖర్చులకు గాను వినియోగదారు ఛార్జీలు పెంచుకునేందుకు బ్యాంకులకు అనుమతి ఇచ్చినట్లు ఆర్​బీఐ తెలిపింది. సొంత బ్యాంక్​ ఏటీఎంల నుంచి వినియోగదారులు ప్రతినెలా 5 ఉచిత లావాదేవీలు(ఆర్థిక, ఆర్థికేతర లావాదేవీలు కలిపి) నిర్వహించుకోవడం కొనసాగనుంది. మెట్రో కేంద్రాల్లో ఇతర బ్యాంకు ఏటీఎంలలో 3 ఉచిత లావాదేవీలు, మిగతా ప్రాంతాల్లో 5 లావాదేవీలను అనుమతిస్తారు.

ఈ ఏడాది ఆగస్టు 1 నుంచి అన్ని ఏటీఎం కేంద్రాల్లోనూ ఒక్కో ఆర్థిక లావాదేవీపై ఇంటర్​ఛేంజ్​ ఫీజు రూ.15 నుంచి రూ.17కు, ఆర్థికేతర లావాదేవీపై రూ.5 నుంచి రూ.6కు ఛార్జీలు పెంచుకునేందుకు ఆర్​బీఐ అనుమతి ఇచ్చింది.

  • ఏటీఎం లావాదేవీలపై ప్రస్తుత ఛార్జీలు 2014 ఆగస్టు నుంచి, ఇంటర్​ఛేంజ్​ ఛార్జీలు 2012 ఆగస్టు నుంచి అమలవుతున్నాయి.
  • గత మార్చి 31కు చూస్తే బ్యాంకు కార్యాలయాల ప్రాంగణాలు పరిధిలో 1,15,605 ఏటీఎంలు, ఇతర ప్రాంతాల్లో 97,970 ఏటీఎం కేంద్రాలున్నాయి.
  • 90 కోట్ల డెబిట్​ కార్డులు వాడుకలో ఉన్నాయి.

ఇదీ చూడండి: ఇకపై నచ్చిన డీలర్​ వద్దే వంట గ్యాస్ రీఫిల్​

ఇదీ చూడండి: Gold Price today: తగ్గిన బంగారం ధర

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.