విమానాల్లో వాడే ఇంధన (ఏటీఎఫ్) ధరలు భారీగా తగ్గాయి. కిలో లీటర్ (వెయ్యి లీటర్లు) ఏటీఎఫ్ ధర రూ.6,812.62 తగ్గి (232 శాతం).. ప్రస్తుతం రూ.22,544.75కు చేరింది. అంతర్జాతీయంగా తగ్గిన ముడి చమురు ధరలకు అనుగుణంగా ఏటీఎఫ్ ధరలు తగ్గించాయి చమురు మార్కెటింగ్ కంపెనీలు.
అంతర్జాతీయంగా నెలకొన్న చమురు సంక్షోభంతో ఏటీఎఫ్ ధరలు వరుసగా తగ్గుతూ వస్తున్నాయి. ఫిబ్రవరితో పోలిస్తే కిలో లీటర్ ఏటీఎఫ్ ధర రూ.64,323.76 నుంచి ఏకంగా రూ.22,544.75కి పడిపోయింది.
పెట్రోల్‌తో పోలిస్తే ఏటీఎఫ్ ధర మూడో వంతుకు చేరింది. దేశ రాజధాని దిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.69.59గా ఉండగా.. లీటర్ ఏటీఎఫ్ ధర రూ.22.54గా ఉంది.
పెట్రోల్, డీజిల్ ధరల్లో మాత్రం ఎలాంటి మార్పులు లేవు. అంతర్జాతీయంగా చమురు ధరలు భారీ పతనాన్ని చవి చూసిన నేపథ్యంలో కొన్ని రోజులుగా పెట్రోల్, డీజిల్ ధరల్లో హెచ్చు తగ్గులను నిలిపేసింది ప్రభుత్వం.
ఇదీ చూడండి:'మే 17 వరకు విమాన సేవలు పునరుద్ధరించరాదు'