ETV Bharat / business

ఆ పథకంలో చేరితే పెన్షన్​ రెట్టింపు?

author img

By

Published : Dec 26, 2019, 6:35 PM IST

అసంఘటిత రంగంలోని కార్మికులకు కేంద్ర ప్రభుత్వం తీపి కబురు అందించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. అటల్​ పెన్షన్​ యోజన పథకంలో వయోపరిమితి పెంపుతో పాటు రెట్టింపు పెన్షన్ ఇవ్వాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది.

ATAL PENSION YOJANA- PENSION FOR THE UNORGANISED SECTOR
అటల్ పెన్షన్​ యోజన

కేంద్ర ప్రభుత్వం అటల్​ పెన్షన్​ యోజన పథకం ద్వారా అసంఘటిత రంగంలోని కార్మికులకు రెట్టింపు పెన్షన్​ అందించాలని భావిస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఈ పథకం ద్వారా లబ్ధిదారులకు 60 ఏళ్లు వచ్చిన నాటి నుంచి నెలకు రూ.1000 నుంచి రూ.5000 అందిస్తున్నారు. అయితే దీనిని రూ.10,000 వరకు పెంచాలని కేంద్రం యోచిస్తోంది. ఇదే జరిగితే లక్షలాది మంది లబ్దిదారులకు ప్రయోజనం చేకూరనుంది.

వయోపరిమితి పెంపు?

అటల్​ పెన్షన్​ యోజన పథకంలో చేరేవారి వయోపరిమితి కూడా పెంచాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఈ పథకంలో 18 నుంచి 40 ఏళ్ల వయస్సు వారు మాత్రమే చేరవచ్చు. ఈ వయోపరిమితిని కాస్తా 50 ఏళ్లకు పెంచాలని కేంద్రం భావిస్తోంది.

చందా- పెన్షన్​

అటల్​ పెన్షన్​ యోజన పథకానికి నెలకు చెల్లించాల్సిన చందా మొత్తం వయసు, పెన్షన్​ మొత్తం ప్రాతిపదికన మారుతుంది. ప్రస్తుతం అర్హులైన వారు చందా చెల్లించాల్సిన వివరాలు ఇలా ఉన్నాయి.

వయస్సు పెన్షన్​ మొత్తం చందా
18 ఏళ్లు రూ.1000​ రూ.42
18 ఏళ్లు రూ.2000 రూ.84
18 ఏళ్లు రూ.3000 రూ.126
18 ఏళ్లు రూ.4000 రూ.168
18 ఏళ్లు రూ.5000 రూ.210
39 ఏళ్లు రూ.1000​ రూ.264
39 ఏళ్లు రూ.5000 రూ.1,318

అర్హతలు

అటల్​ పెన్షన్​ యోజన పథకంలో చేరాంటే భారతీయ పౌరులై ఉండాలి. కనీసం 20 ఏళ్లు చందా కొనసాగించాలి. తప్పనిసరిగా బ్యాంకు ఖాతాకు ఆధార్​ అనుసంధానించి ఉండాలి. మొబైల్ నెంబర్ ఉండాలి. వివిధ బ్యాంకులు ఈ పథకాన్ని అందిస్తున్నాయి. నేరుగా బ్యాంకుకు వెళ్లి ఈ పథకంలో చేరవచ్చు.

ఇదీ చూడండి: యువత మొగ్గు రక్షణ పథకాలవైపే

********************
Thank you for using CCTV+ content.Please contact Ms. Haley HE at service@cctvplus.com or call +86 10 63960094 for any further enquiries about CCTV+ content.

Copyright 2013 CCTV. All rights reserved.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.