ETV Bharat / business

Biological-E: రూ.500లకే రెండు డోసుల టీకా! - బయోలాజికల్​ ఇ కరోనా టీకా ధర

బయోలాజికల్​ ఇ.లిమిటెడ్​ అభివృద్ధి చేస్తోన్న కార్బివాక్స్​ కరోనా టీకా.. దేశంలోనే అత్యంత చవకైనదిగా నిలిచే అవకాశం ఉంది. ఈ టీకా రెండు డోసులు కేవలం రూ.500లకే లభించనుందని సమాచారం.

biological e's corbevax price
బయోలాజికల్​ ఇ కరోనా టీకా ధర
author img

By

Published : Jun 5, 2021, 11:57 AM IST

ఫార్మా సంస్థ బయోలాజికల్‌ ఇ. లిమిటెడ్‌(బీఇ) అభివృద్ధి చేస్తున్న కార్బివాక్స్‌ టీకా దేశంలోనే అత్యంత చవకైన వ్యాక్సిన్‌ కానున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం మూడో దశ ప్రయోగాల్లో ఉన్న ఈ టీకా ధర రెండు డోసులకు కలిపి రూ. 500గా ఉండనున్నట్లు ఓ ఆంగ్ల మీడియా కథనం వెల్లడించింది. అంటే ఒక్కో డోసు కేవలం రూ. 250 మాత్రమే. ఇంతకంటే తక్కువ కూడా ఉండొచ్చని సదరు మీడియా కథనం పేర్కొంది. అయితే ప్రభుత్వాలకు, ప్రైవేటు ఆసుపత్రులకు ఒకే ధరకు విక్రయించనున్నారా లేదా అన్నదానిపై ఇంకా స్పష్టత లేదు.

అయితే సంస్థ మాత్రం ఇంకా కార్బివాక్స్‌ టీకా ధరను అధికారికంగా ప్రకటించలేదు. ఒకవేళ రూ. 500కే రెండు డోసులు లభిస్తే (ప్రభుత్వాలకు, ప్రైవేటుకు ఇదే ధరకు విక్రయిస్తే) దేశంలోనే అత్యంత చవకైన వ్యాక్సిన్‌ ఇదే కానుంది. ప్రస్తుతం దేశంలో అందుబాటులోకి వచ్చిన కరోనా టీకాల ధరలు ఇంతకంటే ఎక్కువే ఉన్నాయి. సీరం సంస్థ అభివృద్ధి చేసిన కొవిషీల్డ్‌ ధర రాష్ట్ర ప్రభుత్వాలకు రూ. 600/2 డోసులు, ప్రైవేటులో రూ. 1200/2 డోసులుగా ఉంది. ఇక భారత్‌ బయోటెక్‌ ఉత్పత్తి చేసిన కొవాగ్జిన్ ధర ప్రభుత్వాలకు రూ. 800(రెండు డోసులకు), ప్రైవేటు ఆసుపత్రులకు రూ. 2400(రెండు డోసులకు)గా ఉంది. రష్యా టీకా స్పుత్నిక్‌ వి ధర ఒక్కో డోసుకు రూ. 995గా నిర్ణయించినట్లు డాక్టర్‌ రెడ్డీస్‌ ఇటీవలే ప్రకటించింది.

అమెరికాకు చెందిన బేలార్‌ కాలేజ్‌ ఆఫ్‌ మెడిసిన్‌తో కలిసి బయోలాజికల్‌ ఇ సంస్థ కార్బివాక్స్‌ టీకాను అభివృద్ధి చేసింది. ఈ టీకా మొదటి రెండు దశల్లో మెరుగైన ఫలితాలు చూపగా.. ప్రస్తుతం మూడో దశ క్లినికల్‌ పరీక్షలు కొనసాగుతున్నాయి. బయోలాజికల్‌-ఇ నుంచి 30 కోట్ల టీకా డోసుల కోసం ఇటీవల కేంద్ర ప్రభుత్వం ముందస్తు ఒప్పందం చేసుకుంది. ఇందులో భాగంగా రూ. 1,500 కోట్లను కేంద్రం కంపెనీకి అడ్వాన్స్‌గా ఇవ్వనుంది. మూడో దశ ప్రయోగాల తర్వాత అత్యవసర వినియోగానికి సంస్థ దరఖాస్తు చేసుకుంది. మరికొద్ది నెలల్లోనే ఈ టీకా అందుబాటులోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. కొవాగ్జిన్‌ తర్వాత రానున్న మరో దేశీయ టీకా ఇదే కావడం విశేషం.

ఇదీ చూడండి: Vaccine: 'త్వరలో కొవాగ్జిన్‌కు డబ్ల్యూహెచ్‌ఓ గుర్తింపు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.