ETV Bharat / business

అది తెలిసిన క్షణాల్లోనే భారత్​పే ఎండీ రాజీనామా!

Ashneer Grover Resigns: ప్రముఖ ఆన్​లైన్ చెల్లింపుల సంస్థ భారత్​ పే ఎండీ అశ్నీర్​ గ్రోవర్ తన పదవికి రాజీనామా చేశారు. అడ్వైజరీ సంస్థ పీడబ్ల్యూసీ నివేదిక ఆధారంగా.. తన​పై చర్యలు తీసుకునే అంశాన్ని వచ్చే బోర్డు మీటింగ్ అజెండాలో చేర్చినట్లు తెలుసుకున్న నిమిషాల్లోనే ఈ నిర్ణయం తీసుకున్నారు.

Ashneer Grover resigns
Ashneer Grover resigns
author img

By

Published : Mar 1, 2022, 4:31 PM IST

Ashneer Grover Resigns: ఫిన్​టెక్​ సంస్థ భారత్​పే సహా వ్యవస్థాపకుడు, మేనేజింగ్​ డైరెక్టర్​ అశ్నీర్​ గ్రోవర్​ రాజీనామా చేశారు. నేడు(మంగళవారం) బోర్డు మీటింగ్​​ అజెండాను అందుకున్న నిమిషాల్లోని బోర్డు ఆఫ్​ డైరెక్టర్స్​ నుంచి గ్రోవర్​ వైదొలిగారు. అడ్వైజరీ కంపెనీ పీడబ్ల్యూసీ సమర్పించిన నివేదిక ఆధారంగా.. వచ్చే బోర్డు సమావేశంలో తనపై చర్య తీసుకునే అంశాన్ని అజెండాలో చేర్చినట్లు తెలుసుకున్న ఆయన.. ఈ నిర్ణయం తీసుకున్నారు.

Ashneer Grover Resigns causes

"అశ్నీర్ గ్రోవర్​ ప్రవర్తనకు సంబంధించి పీడబ్ల్యూసీ నివేదికను సమర్పించింది. దాని ఆధారంగా ఆయనపై చర్యలు తీసుకునే అంశాన్ని రాబోయే బోర్డు అజెండాలో చేర్చారు. ఇది తెసుకున్న నిమిషాల్లోనే ఆయన ఎండీ పదవికి రాజీనామా చేశారు. బోర్డు ఆఫ్​ డైరెక్టర్స్​ నుంచి తప్పుకున్నారు. నివేదిక ఆధారంగా చర్యలు తీసుకునే హక్కు బోర్డుకు ఉంది" అని భారత్‌పే ఓ ప్రకటనలో తెలిపారు. గ్రోవర్ ప్రవర్తనపై పీడబ్ల్యూసీ నివేదిక అంశాలపై చర్చించేందుకు మంగళవారం బోర్డు సమావేశం జరగనుంది. కంపెనీ ఆర్థిక లావాదేవీల్లో అవకతవకలకు పాల్పడినట్లు ఆయనపై ఆరోపణలు వచ్చాయి.

బలవంతంగా వైదొలుగుతున్నా..

తాను వ్యవస్థాపకుడిగా ఉన్న కంపెనీకి బలవంతంగా వైదొలుగుతున్నట్లు గ్రోవర్ తన రాజీనామా లేఖలో పేర్కొన్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. "నాతో పాటు సంస్థ ప్రతిష్ఠను కూడా దెబ్బతీయడానికి కొందరు కుట్ర పన్నుతున్నారు. నిరాధారమైన ఆరోపణలతో నన్ను లక్ష్యంగా చేసుకున్నారు. ఇందులో నాతోపాటు నా కుటుంబం కూడా చిక్కుకుంది" అని గ్రోవర్​ ఆరోపించినట్లు ఆ వర్గాలు తెలిపాయి.

భార్య వైదొలిగిన వారంలోపే..

కంపెనీలో కంట్రోల్స్​ హెడ్‌గా ఉన్న గ్రోవర్​ భార్య మాధురీ జైన్​ గ్రోవర్‌ కూడా ఆర్థిక అవకతవకలకు పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. సంస్థ నిధులను ఆమె తన స్వప్రయోజనాలకు వినియోగించుకున్నారని.. ఆ డబ్బుతోనే యుఎస్​, దుబాయ్​ ట్రిప్​కు వెళ్లిన్నట్లు ఆరోపణలు వచ్చాయి. దీంతో ఆమె తన పదవి నుంచి తప్పుకున్నారు. ఇది జరిగిన కొన్ని రోజులకే గ్రోవర్​ కూడా రాజీనామా చేశారు.

ఇదీ చూడండి: 'పుట్టినప్పుడు ఏడవలేదు.. ఇప్పుడు ఇంతలా ఏడిపిస్తాడని అనుకోలేదు!'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.