ఐఫోన్ ప్రేమికులకు శుభవార్త. ఈ నెల 14న ఐఫోన్ 13(Iphone 13) విడుదల కార్యక్రమం జరగనున్నట్లు టెక్ దిగ్గజం యాపిల్ ప్రకటించింది. ఈ కార్యక్రమంలో నాలుగు కొత్త ఐఫోన్ మోడళ్లు - ఐఫోన్ 13, ఐఫోన్ 13 మినీ, ఐఫోన్ 13 ప్రో, ఐఫోన్ 13 ప్రో మ్యాక్‌లను కంపెనీ విడుదల చేసే అవకాశం ఉంది.
యాపిల్ వాచీ సిరీస్ 7, కొత్త యాపిల్ ఎయిర్‌పాడ్స్ 3 వంటి ఉపకరణాలను సైతం విడుదల చేయొచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. అంతర్జాతీయంగా విడుదల చేసిన తర్వాత భారత్‌లో ఐఫోన్ 13 ధరలను(Apple iPhone cost in india) యాపిల్ ప్రకటించొచ్చు. దేశీయంగా వీటి విక్రయాలు అక్టోబరులో ప్రారంభమయ్యే అవకాశం ఉంది.
ఇవీ చదవండి: