Work From Home: కరోనా కారణంగా దాదాపు అన్ని ప్రముఖ సంస్థలు తమ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోంను కొనసాగిస్తున్నాయి. తాజాగా ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ దిగ్గజం యాపిల్ తమ ఉద్యోగులకు మరింత కాలం వర్క్ ఫ్రమ్ హోమ్‌ను కల్పించనున్నట్లు ప్రకటించింది. అంతేకాదు.. వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్న తమ ఉద్యోగులకు రూ. 76,131 (వెయ్యి డాలర్లు) బోనస్‌ను కూడా ఇస్తున్నట్లు పేర్కొంది. ఒమిక్రాన్ వ్యాప్తి నేపథ్యంలో సంస్థ ఈ నిర్ణయం తీసుకుంది. దీనిపై యాపిల్ సీఈఓ టిమ్ కుక్ ఉద్యోగులకు ఓ నోట్ పంపారు.
ఉద్యోగులు మళ్లీ కార్యాలయాలకు ఎప్పుడు రావాలి అనే విషయంపై సంస్థ తన ప్రకటనలో ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. ఇందుకు సంబంధించి నెల రోజుల ముందు ఉద్యోగులకు సమాచారం అందిస్తామని పేర్కొంది. ఒకవేళ ప్రారంభమైనా.. సోమవారం, మంగళవారం, గురువారం మాత్రమే ఆఫీస్‌లో పనిచేయాల్సి ఉంటుంది. బుధ, శుక్రవారాల్లో వర్క్ ఫ్రమ్ హోమ్ ఇస్తుంది.
ఇదీ చూడండి : 'అత్యధిక సంపద సృష్టి సంస్థగా రిలయన్స్'