ETV Bharat / business

సులభతర వాణిజ్యంలో తెలుగు రాష్ట్రాలు టాప్​

author img

By

Published : Sep 5, 2020, 5:35 PM IST

Updated : Sep 5, 2020, 7:44 PM IST

కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్​.. బీఆర్​ఏపీ-2019 నివేదికను విడుదల చేశారు. సులభతర వ్యాణిజ్యంలో.. గతేడాది మొదటి స్థానాన్ని దక్కించుకున్న ఆంధ్రప్రదేశ్​.. ఈసారి కూడా టాప్​లో నిలిచింది. ఉత్తర్​ప్రదేశ్​, తెలంగాణలు ఆ తర్వాతి స్థానాలు కైవసం చేసుకున్నాయి.

andhra-pradesh-again-tops-ease-of-doing-business-ranking-of-states-uts
సులభతర వాణిజ్యంలో తెలుగు రాష్ట్రాలు టాప్​

రాష్ట్ర వ్యాపార సంస్కరణల కార్యాచరణ ప్రణాళిక-2019 నివేదికను కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్​ విడుదల చేశారు. ఇందులో సులభతర వాణిజ్య విభాగంలో ఆంధ్రప్రదేశ్​కు మొదటి స్థానం దక్కింది. ఉత్తర్​ప్రదేశ్​, తెలంగాణలు ఆ తర్వాతి స్థానాల్లో నిలిచాయి.

ఆంధ్రప్రదేశ్​కు మొదటి స్థానం దక్కడం వరుసగా ఇది రెండోసారి. అయితే ఇలాంటి ర్యాంకింగ్స్​ ఇవ్వడం వల్ల రాష్ట్రాల పనితీరు మెరుగుపడుతుందని నిర్మలా సీతారామన్​ అభిప్రాయపడ్డారు.

2018తో పోల్చుకుంటే ఏకంగా 10స్థానాలు మెరుగుపరుచుకుని 2వ ర్యాంకుకు చేరుకుంది ఉత్తర్​ప్రదేశ్​. తెలంగాణ రెండో ర్యాంకు నుంచి మూడుకు పడిపోయింది.

మధ్యప్రదేశ్​, ఝార్ఖండ్​, ఛత్తీస్​గఢ్​, హిమాచల్​ప్రదేశ్​, రాజస్థాన్​, బంగాల్​, గుజరాత్​ రాష్ట్రాలు ఆ తర్వాతి స్థానాలను కైవసం చేసుకున్నాయి. దేశ రాజధాని దిల్లీ 12 ర్యాంకును దక్కించుకుంది.

andhra-pradesh-again-tops-ease-of-doing-business-ranking-of-states-uts
ర్యాంకింగ్స్​ జాబితా

వీటి ఆధారంగా...

ఈ నివేదికను డీపీఐఐటీ(డిపార్ట్​మెంట్​ ఫర్​ ప్రమోషన్​ ఆఫ్​ ఇండస్ట్రీ అండ్​ ఇంటర్నల్​ ట్రేడ్​) రూపొందించింది. నిర్మాణ పరిమితులు, కూలీల నియంత్రణ, పర్యావరణానికి సంబంధించిన రిజిస్ట్రేషన్లు, భూమి లభ్యత, ఒకే వేదికపై పూర్తి సమాచారాన్ని అందించే వ్యవస్థ(సింగిల్​ విండో సిస్టమన్​) ఆధారంగా ఈ ర్యాంకింగ్స్​ను విడుదల చేస్తారు.

ఇదీ చూడండి:- కేంద్ర, రాష్ట్రాల అప్పుల్లో భారీ పెరుగుదల

Last Updated : Sep 5, 2020, 7:44 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.