సింహాలతో ఆనంద్ మహీంద్ర సందేశం! - ఆనంద్ మహీంద్ర ఈటీవీ భారత్
ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్ర.. తాజాగా చేసిన ట్వీట్ వైరల్ అయ్యింది. ఓ వ్యక్తి చిత్రీకరించిన వీడియోలో.. రెండు సింహాలు నీళ్లు తాగుతూ కనపడ్డాయి. మనుషులు, జంతువులు కలిసి జీవించే ప్రపంచం వచ్చే అవకాశముందని ఆనంద్ మహీంద్ర అభిప్రాయపడ్డారు.
సామాజిక మాధ్యమాల్లో చురుకుగా ఉంటారు ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్ర. తాజాగా.. రెండు సింహాలకు సంబంధించి ఓ ట్వీట్ షేర్ చేశారు. ఆయన చేసిన ఈ సందేశాత్మక ట్వీట్ నెట్టింట వైరల్ అయ్యింది. జంతువులు, మనిషి కలిసి జీవించే ప్రపంచం గురించి ఆయన ట్వీట్ చేశారు.
వీడియోలో..
ఆనంద్ మహీంద్ర షేర్ చేసిన ట్వీట్లో.. ఓ వ్యక్తికి తలుపు తెరవగానే.. రెండు సింహాలు కనపడ్డాయి. అవి అక్కడే ఉన్న చిన్న తొట్టెలో నీళ్లు తాగుతూ కనపడ్డాయి. అవి ఆ వ్యక్తిని చూశాయి. కానీ దాడికి దిగలేదు. ఆ వ్యక్తి కూడా వాటిని పంపించేందుకు ఎలాంటి ప్రయత్నం చేయలేదు.
అ వ్యక్తి చూసిన తర్వాత సింహాలు.. మళ్లీ నీరు తాగడం మీద దృష్టి పెట్టాయి. అలా దాహం తీర్చుకున్న తర్వాత అక్కడి నుంచి వెళ్లిపోయాయి.
దీనిని ట్వీట్ చేస్తూ.. ఓ సందేశాన్ని జోడించారు ఆనంద్ మహీంద్ర.
-
Posted to me today but apparently a month old video from Junagadh. An unexpected morning surprise for this resident. Perhaps a better world is on hand... a world in which we all learn to coexist and drink from the same well... pic.twitter.com/xeSn7h4PeH
— anand mahindra (@anandmahindra) May 6, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
">Posted to me today but apparently a month old video from Junagadh. An unexpected morning surprise for this resident. Perhaps a better world is on hand... a world in which we all learn to coexist and drink from the same well... pic.twitter.com/xeSn7h4PeH
— anand mahindra (@anandmahindra) May 6, 2021Posted to me today but apparently a month old video from Junagadh. An unexpected morning surprise for this resident. Perhaps a better world is on hand... a world in which we all learn to coexist and drink from the same well... pic.twitter.com/xeSn7h4PeH
— anand mahindra (@anandmahindra) May 6, 2021
"ఇది నాకు ఇవాళ కనపడింది. ఇది జునాగఢ్ ప్రాంతానికి చెందింది అనుకుంటా. నెల క్రితం వీడియో అనుకుంటున్నాను. ఉదయాన్నే ఆ వ్యక్తికి అనుకోని సంఘటన ఎదురైంది. మెరుగైన ప్రపంచంవైపు అడుగులు వేస్తున్నామనిపిస్తోంది. అందరం కలిసి జీవిస్తూ.. ఒకటే బావి నుంచి కలిసి నీళ్లు తాగే ప్రపంచం అది."
--- ఆనంద్ మహీంద్ర, ప్రముఖ వ్యాపారవేత్త.
ఇదీ చూడండి:- మహీంద్ర ఆమె ఫొటో కోసం అంత వెతికారా..?