ETV Bharat / business

'తెలివైన భార్యతో చిక్కు'... అంతేగా అంతేగా!

మహీంద్ర గ్రూప్​ ఛైర్మన్​ ఆనంద్ మహీంద్రకు ఓ వింత ఆలోచన వచ్చింది. మూగ, చెవిటి వ్యక్తిగా నటిస్తే ఎలా ఉంటుందోనని ఊహించుకున్నారు. అదే విషయాన్ని భార్యకు చెప్పారు. మరి ఆమె ఏమన్నారు?

తెలివైన భార్యతో చిక్కు
author img

By

Published : Apr 29, 2019, 6:30 PM IST

ట్విట్టర్​లో అత్యంత చురుగ్గా ఉండే పారిశ్రామికవేత్త.... మహీంద్ర గ్రూప్ ఛైర్మన్ ఆనంద్ మహీంద్ర. తాజాగా... తెలివైన భార్య ఉంటే ఎలాంటి ప్రమాదం ఉంటుందో చెబుతూ ఆయన ఓ సరదా ట్వీట్ చేశారు. దీనికిప్పుడు సోషల్​ మీడియాలో విశేష స్పందన వస్తోంది.

ఓ వార్తా పత్రికలో వచ్చిన కథనాన్ని ట్విట్టర్​లో షేర్​ చేశారు ఆనంద్​. "ఓ వ్యక్తి తన భార్య మాటలు వినకూడదనే ఉద్దేశంతో 62ఏళ్ల పాటు మూగ, చెవిటివాడిగా నటించాడు" అన్నది ఆ వార్త సారాంశం.

ఆ వార్త పేపర్​ క్లిప్పింగ్​తోపాటు మహీంద్ర ఓ శీర్షిక రాశారు. "ఇది చదివి 5 నిమిషాలు ఆగకుండా నవ్వాను. నేను కూడా ఇలాగే చేస్తే ఏంచేస్తావని నా భార్యను అడిగాను" అని.

  • Laughed non-stop for 5 mins on reading this. Asked my wife if I could have fooled her like this. She didn’t waste even a few seconds in replying: She said “Really? Would you have lasted 5 mins without speaking into your cellphone?” Aah, the perils of having a smart wife! pic.twitter.com/msWJLbB1ZD

    — anand mahindra (@anandmahindra) April 28, 2019 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ఆనంద్ సతీమణి అనురాధా మహీంద్ర స్పందన ఇక్కడ అసలు కిక్కు.

"నిజమా? ఎప్పుడైనా ఓ 5 నిమిషాలు ఫోన్​ లేకుండా ఉన్నారా మీరు?" అని ఠక్కున స్పందించారట ఆవిడ.

"తెలివైన భార్య ఉంటే ఇలాంటి ప్రమాదాలు తప్పవు" అంటూ నిట్టూర్చారు ఆనంద్ మహీంద్ర. అంతేగా అంతేగా..!

Intro:Body:Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.