ETV Bharat / business

ఒకే ఒక్క ప్రయోగం మార్చింది యువకుడి జీవితం..!

author img

By

Published : Nov 22, 2019, 2:42 PM IST

వీధి శునకాల రక్షణ కోసం కనిపెట్టిన 'పరావర్తన బెల్టు'తో ఓ యువకుడిని ఊహించని ఆఫర్​ వరించింది. ముంబయికి చెందిన శంతన నాయుడు అనే యువకుడి సృజనాత్మకతకు మెచ్చిన టాటాసన్స్​ ఛైర్మన్​ రతన్​ టాటా.. ఆ 27 ఏళ్ల కుర్రాడిని అసిస్టెంట్​గా నియమించుకున్నారు. ఇదే విషయాన్ని ఫేస్​బుక్​లోని హ్యూమన్స్​ ఆఫ్​ బాంబే అనే గ్రూపులో పంచుకున్నాడు శంతను.

శునకాల కోసం చేసిన ప్రయోగం మార్చింది యువకుడి జీవితం

టాటా సన్స్‌ సంస్థల గౌరవ ఛైర్మన్‌ రతన్‌ టాటాకు శునకాలపై ఉన్న ప్రేమ ఓ యువకుడికి బంపర్‌ ఆఫర్‌ తెచ్చిపెట్టింది. ముంబయికి చెందిన 27 ఏళ్ల శంతను నాయుడు రతన్‌ టాటాకు అసిస్టెంట్‌గా నియమితులయ్యాడు. వాహనాల నుంచి వీధి శునకాల రక్షణ కోసం ఇతను కనిపెట్టిన ఓ పద్ధతి రతన్‌ టాటాకు ఎంతగానో నచ్చింది. తాను రతన్‌ టాటాను కలిసింది మొదలు, తనకు ఉద్యోగం వచ్చిన తీరును శంతను నాయుడు ఫేస్‌బుక్‌లోని ‘హ్యుమన్స్‌ ఆఫ్‌ బాంబే’ అనే గ్రూపులో పంచుకున్నాడు. ప్రస్తుతం ఈ పోస్ట్‌ వైరల్‌గా మారింది.

ఐదేళ్ల క్రితం శంతను రోడ్డుపై వెళ్తుండగా వాహనం ఢీకొని ఓ వీధి శునకం మరణించడం చూశాడు. దీనికి పరిష్కార మార్గం కనుగొనాలని సంకల్పించాడు. డ్రైవర్లకు దూరం నుంచి శునకాలు కనిపించేలా వాటి మెడకు తగిలించేందుకు పరావర్తనం (రిఫ్లెక్ట్‌) చెందే బెల్టులను తయారు చేశాడు. దీనివల్ల దూరం నుంచే డ్రైవర్లు రోడ్లపై శునకాలను గుర్తించగలుగుతారు.

టాటాకు లేఖ రాయమని సలహా..

ఈ ఆలోచన విస్తృతంగా వ్యాపించి, టాటా గ్రూపు సంస్థల న్యూస్‌ లెటర్‌లో అచ్చయింది. సరిగ్గా ఇప్పుడే మా నాన్న రతన్‌ టాటాకు ఓ లేఖ రాయాలని సూచించారు. ఎందుకంటే రతన్‌ టాటాకు కూడా శునకాలంటే ఇష్టమని అన్నారు. తొలుత ఇందుకు నేను తటపటాయించినా, తర్వాత టాటాకు లేఖ రాశాను. ఇదే నా జీవితాన్ని మలుపు తిప్పింది.’’

AN EXPERIMENT TO PROTECT STREET DOGS CHANGES MAN'S LIFE
రతన్ టాటాతో శంతను నాయుడు

రెండు నెలల తర్వాత నన్ను కలవాలని అనుకుంటున్నట్లు రతన్‌ టాటా నుంచి సమాధానం వచ్చింది. నేను నమ్మలేకపోయా!! కొద్ది రోజులకే ఎంతో గొప్ప వ్యక్తిని ముంబయిలోని ఆయన కార్యాలయంలో కలిశాను. నేను చేసిన పని ఆయనకు ఎంతగానో నచ్చిందని టాటా చెప్పారు. తర్వాత నేను నా పైచదువులకు విదేశాలకు వెళ్లా. వచ్చాక నా జీవితమంతా టాటా ట్రస్టుకే అంకితం చేస్తానని ఆయనకు చెప్పా. నేను భారత్‌కు వచ్చాక ఆయన కాల్‌ చేశారు. ఇక్కడ పని చేయాల్సింది చాలా ఉందని నన్ను ఆహ్వానించారు. నువ్వు నా అసిస్టెంట్‌గా ఉంటావా? అని అడిగారు. కొన్ని క్షణాల పాటు ఎలా స్పందించాలో నాకు అర్థం కాలేదు. వెంటనే సరే అని చెప్పేశాను. అని శంతను నాయుడు ఫేస్‌బుక్‌ పోస్ట్‌లో వివరించారు.

AP Video Delivery Log - 0800 GMT News
Friday, 22 November, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-0725: Japan G20 Bilats AP Clients Only 4241225
Japan FM meets Saudi Arabia, Turkey FMs at G20
AP-APTN-0720: Hong Kong Police No Access Hong Kong 4241224
HKG police commissioner: violence may deter voters
AP-APTN-0700: France Domestic Violence AP Clients Only 4241156
Graffiti campaign highlights French femicide victims
AP-APTN-0655: US DC Trump White House AP Clients Only 4241223
Trump returns to White House
AP-APTN-0640: New Zealand UK Backpacker 2 No Access New Zealand 4241218
Jury delivers guilty verdict in Grace Millane murder
AP-APTN-0631: New Zealand UK Backpacker No Access New Zealand 4241216
Parents react as man found guilty of Grace Millane murder
AP-APTN-0631: Thailand Pope Speech Bishops 2 AP Clients Only 4241217
Pope encourages bishops to spread the faith
AP-APTN-0622: New Zealand UK Royals 2 No access new Zealand 4241207
Prince Charles ignores question about his brother
AP-APTN-0617: US CA Flight Returns Must credit content creator; Must credit KABC; No access Los Angeles; No use by US Broadcast Networks; No re-sale, re-use or archive 4241198
Jet with flaming engine lands safely at LA airport
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.