ETV Bharat / business

ఆ కంపెనీలో 25వేల మంది ఉద్యోగులు తొలగింపు

author img

By

Published : Jul 16, 2020, 1:17 PM IST

అక్టోబరులో 25వేల మంది ఉద్యోగులను తొలగించనున్నట్లు అమెరికన్ ఎయిర్​లైన్స్​ తెలిపింది. ఈ మేరకు ఉద్యోగులకు నోటీసులు జారీ చేసింది. కరోనా సంక్షోభం కారణంగా ఉద్యోగులకు జీతాలిచ్చే పరిస్థితి లేనందువల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సంస్థ స్పష్టం చేసింది.

American Airlines warns 25,000 workers they could lose jobs
25వేల మంది ఉద్యోగులను తొలగించనున్న ప్రముఖ ఎయిర్​లైన్స్​

కరోనా మహమ్మారి దెబ్బకు విమానయాన సంస్థలు పీకల్లోతు నష్టాల్లో కూరుకుపోతున్నాయి. గతంలో భారీగా ఉండే విమాన ప్రయాణాలు ఒక్కసారిగా తగ్గాయి. ఈ నేపథ్యంలో ఉద్యోగులకు జీతాలిచ్చే పరిస్థితి లేనందున 25వేల మంది సిబ్బందిని అక్టోబరులో తొలగించనున్నట్లు అమెరికన్​ ఎయిర్​లైన్స్​ ప్రకటించింది. ఈ మేరకు ఉద్యోగులకు నోటీసులు జారీ చేసినట్లు పేర్కొంది.

వేతనాల్లో కోతకు, రెండేళ్లపాటు పెయిడ్​ లీవ్స్​ వదులుకునేందుకు సిబ్బంది అంగీకరిస్తే ఉద్యోగాలు కోల్పోయేవారి సంఖ్య తగ్గుతుందని అమెరికన్​ ఎయిర్​లైన్స్​ నిర్వాహకులు తెలిపారు.

భవిష్యత్తులో విమాన ప్రయాణాలకు డిమాండ్ భారీగా తగ్గిపోతుందని.. సంస్థలకు నష్టాలు తప్పవని తెలిసి ముందు జాగ్రత్త చర్యగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు అమెరికన్ ఎయిర్​లైన్స్​ సీఈఓ డాగ్​ పార్కర్​ చెప్పారు.

ఏప్రిల్ మధ్యకాలం నుంచి విమాన ప్రయాణాల సంఖ్య స్వల్పంగా పెరిగినప్పటికీ గతేడాది జూన్​ ఆదాయంతో పోల్చితే ఈ ఏడాది జూన్​ ఆదాయం 80 శాతం తగ్గినట్లు సంస్థ వెల్లడించింది.

అక్టోబరు వరకు సంస్థల్లో ఉద్యోగులను తొలగించకుండా ఉండేందుకు 25 బిలియన్​ డాలర్ల ఆర్థిక సాయాన్ని అమెరికా ప్రభుత్వాన్ని కోరాయి అక్కడి ఎయిర్​లైన్​ సంస్థలు. అమెరికన్ ఎయిర్​లైన్స్​కు 5.8 బిలియన్​ డాలర్ల ఆర్థిక సాయం అందింది. ఈ సాయం ఉద్యోగులను అక్టోబరు వరకు మాత్రమే కాపాడగలిగింది.

అమెరికాలోని ఇతర విమానయాన సంస్థలు కూడా సిబ్బందిని భారీగా తొలగిస్తున్నాయి. 36వేల మందిని తప్పించనున్నట్లు గతవారమే ప్రకటించింది యునైటెడ్ ఎయిర్​లైన్స్​. 17వేల మంది సంస్థ నుంచి తప్పుకునేందుకు అంగీకరించినట్లు డెల్టా ఎయిర్​లైన్స్ ఈ వారమే ప్రకటించింది.

ఇదీ చూడండి: ట్రంప్ ఎన్నికల ప్రచార బృందానికి కొత్త సారథి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.