ETV Bharat / business

లాభార్జనలో అమెజాన్​ రికార్డు- ఒకేరోజు రూ.14.18 లక్షల కోట్లు - అమెజాన్​ ఒకరోజు లాభాలు

Amazon profit record: ఈ-కామర్స్‌ దిగ్గజం అమెజాన్‌ లాభార్జనలో సరికొత్త రికార్డు నెలకొల్పింది. అమెరికా చరిత్రలో ఒక్కరోజు వ్యవధిలో అత్యధిక మార్కెట్‌ విలువను జోడించుకున్న సంస్థగా నిలిచింది. టెస్లా పేరిట ఉన్న రికార్డును బద్దలు కొట్టింది.

Amazon profit record
Amazon profit record
author img

By

Published : Feb 6, 2022, 6:09 AM IST

Amazon profit record: అమెరికా చరిత్రలో ఒక్కరోజు వ్యవధిలో అత్యధిక మార్కెట్‌ విలువను జోడించుకున్న సంస్థగా ఈ-కామర్స్‌ దిగ్గజం అమెజాన్‌ రికార్డు నెలకొల్పింది. త్రైమాసిక ఫలితాలు మదుపర్లను మెప్పించడంతో కంపెనీ షేర్లు శుక్రవారం 13.5 శాతం మేర లాభపడ్డాయి. దీంతో అమెజాన్ మార్కెట్‌ విలువ ఒకేరోజులో 190 బిలియన్ డాలర్లు (రూ.14.18 లక్షల కోట్లు) ఎగబాకి 1.6 ట్రిలియన్‌ డాలర్లకు చేరింది. ఫేస్‌బుక్‌ మాతృసంస్థ మెటా ఒకరోజు వ్యవధిలో అత్యధిక విలువను కోల్పోయి రికార్డు సృష్టించిన మరుసటి రోజే ఈ పరిణామం చోటుచేసుకోవడం గమనార్హం.

అమెజాన్‌ తాజాగా టెస్లా పేరిట ఉన్న రికార్డును బద్దలు కొట్టింది. జనవరి 28న వెలువడిన త్రైమాసిక ఫలితాలు అంచనాలను మించడంతో టెస్లా షేర్లు ఆరోజు భారీగా ర్యాలీ అయ్యాయి. ఒక్క రోజులో 181 బిలియన్‌ డాలర్ల అదనపు మార్కెట్‌ విలువను కంపెనీ సొంతం చేసుకుంది. తాజాగా ఈ రికార్డును అమెజాన్‌ అధిగమించింది. త్రైమాసిక ఫలితాలు మెప్పించడం, అమెరికాలో ప్రైమ్‌ సభ్యత్వ ధరలను పెంచనున్నట్లు ప్రకటించడమే అమెజాన్‌ షేర్ల ర్యాలీకి కారణం.

ఈ ర్యాలీని రిటైల్‌ మదుపర్లు లాభాల స్వీకరణకు వినియోగించుకున్నట్లు ఫిడెలిటీ వెబ్‌సైట్‌ వివరాల ద్వారా తెలుస్తోంది. కొనుగోలు ఆర్డర్ల కంటే అమ్మకపు ఆర్డర్లే శుక్రవారం ఎక్కువగా కనిపించినట్లు మార్కెట్‌ నిపుణులు తెలిపారు. అమెజాన్‌ ఒక్కరోజులో పోగేసుకున్న సంపద ఏటీఅండ్‌టీ, మోర్గాన్‌ స్టాన్లీ, నెట్‌ఫ్లిక్స్ వంటి ప్రముఖ కంపెనీల మార్కెట్‌ విలువతో సమానం కావడం విశేషం. రెఫినిటీవ్‌ వివరాల ప్రకారం.. యాపిల్‌ (2.8 ట్రి.డా), మైక్రోసాఫ్ట్‌ (2.3 ట్రి.డా), ఆల్ఫాబెట్‌ (1.9 ట్రి.డా) మార్కెట్‌ విలువ పరంగా ముందు వరుసలో ఉన్నాయి.

ఇదీ చూడండి: క్యూ3లో అదరగొట్టిన ఎస్​బీఐ.. 62శాతం లాభాలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.