దేశంలోనే అతిపెద్ద ఈ-కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్ మరో భారీ సేల్‌తో వినియోగదారుల ముందుకు రానుంది. ఫ్లిప్‌కార్ట్ '“ది రిపబ్లిక్ డే సేల్'” పేరుతో అమ్మకాలు ప్రారంభించనుంది. ఈ సేల్‌ను జనవరి 19 నుంచి 22 వరకు నిర్వహించనుంది. ఈ సేల్‌లో భాగంగా స్మార్ట్‌ఫోన్స్, ఎలక్ట్రానిక్ పరికరాలు, గృహోపకరణాలు, ఫ్యాషన్ వస్తువులు, గ్రాసరీ, బ్యూటీ, స్పోర్ట్స్, బేబీ కేర్ ఉత్పత్తులపై భారీ మొత్తంలో డిస్కౌంట్లను అందించనుంది.
భారీ డిస్కౌంట్స్
ఐసీఐసీఐ క్రెడిట్ కార్డు, కొటాక్ క్రెడిట్ కార్డు లేదా డెబిట్ కార్డు ద్వారా షాపింగ్ చేసే వారికి అదనంగా 10 శాతం డిస్కౌంట్‌ను సంస్థ అందించనుంది. డెబిట్ కార్డు వినియోగదారులకు ఈఎంఐ సదుపాయాన్ని అందించనుంది. అలాగే బై బ్యాక్ గ్యారంటీ, కేవలం ఒక్క రూపాయి నుంచే కంప్లీట్ మొబైల్ ప్రొటెక్షన్‌ను కూడా ఫ్లిప్‌కార్ట్ అందించనుంది. వీటితో పాటు బజాజ్ ఫిన్సర్వ్ అందించే నో కాస్ట్ ఈఎంఐ, ఎక్స్చేంజ్ ఆఫర్, ఫ్లిప్ కార్ట్ పే లేటర్ లాంటి సేవలు కూడా అందుబాటులో ఉండనున్నాయి. దీనితో పాటు బై బ్యాక్ గ్యారంటీ, రూ.99 ల నుంచే కంప్లీట్ మొబైల్ ప్రొటెక్షన్‌ను కూడా ఫ్లిప్‌కార్ట్ అందిస్తుంది. అలాగే మొబైల్స్‌పై ఎక్స్ఛేంజ్ ఆఫర్‌ను వినియోగదారులకు అందుబాటులోకి తెచ్చింది.
రేపటి నుంచే..
ఫ్లిప్‌కార్ట్ ప్లస్ సభ్యులకు జనవరి 18వ తేదీ రాత్రి 8 గంటల నుంచే ప్రారంభమవుతుంది. వీటితో పాటు సేల్ జరిగే సమయంలో బ్లాక్ బస్టర్ డీల్స్, రష్ అవర్స్, ప్రైస్ క్రాష్ వంటి ఆఫర్లను కూడా అందించనుంది. ఈ సేల్‌లో టీవీలు & అప్లయన్సెస్‌పై 75 శాతం వరకు, ఎలక్ట్రానిక్ పరికరాలపై 80 శాతం వరకు, ఫ్యాషన్‌పై 50 నుంచి 80 శాతం వరకు, హోమ్ & ఫర్నిచర్ పై 80 శాతం వరకు, ఫ్లిప్‌కార్ట్ బ్రాండ్స్ పై 80 శాతం వరకు, అంతర్జాతీయ విమాన టికెట్లపై రూ. 25000 వరకు, రిఫర్బిషడ్ ప్రొడక్ట్స్‌పై 85 శాతం వరకు డిస్కౌంట్‌ను పొందవచ్చు.
అమెజాన్ సేల్
దేశంలో మరో అతిపెద్ద ఈ-కామర్స్ సంస్థ అమెజాన్ కూడా 'గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్' పేరుతో భారీ సేల్‌ను ప్రారంభించనుంది. ఈ సేల్ కూడా జనవరి 19న ప్రారంభమై 22వ తేదీతో ముగుస్తుంది. అమెజాన్ ప్రైమ్ మెంబర్‌షిప్ ఉన్న వారికి ఈరోజు మధ్యాహ్నం 12 గంటల నుంచే సేల్ అందుబాటులోకి వచ్చింది.
చవులూరించే డిస్కౌంట్లు
నాలుగు రోజుల పాటు నిర్వహించే ఈ సేల్‌లో స్మార్ట్‌ఫోన్స్, ఎలక్ట్రానిక్ పరికరాలు, గృహోపకరణాలు, ఫ్యాషన్ వస్తువులపై భారీ మొత్తంలో డిస్కౌంట్లను అందించనుంది అమెజాన్. దీంతో పాటు ఎస్బీఐ బ్యాంకు క్రెడిట్ కార్డు ద్వారా షాపింగ్ చేసే వారికి అదనంగా 10 శాతం డిస్కౌంట్‌ను సంస్థ అందించనుంది. వీటితో పాటు బజాజ్ ఫిన్సర్వ్ అందించే నో కాస్ట్ ఈఎంఐ, డెబిట్ కార్డులపై నో కాస్ట్ ఈఎంఐ, ఎక్స్ఛేంజ్ ఆఫర్ లాంటి సేవలు కూడా అందుబాటులో ఉండనున్నాయి.
గోల్డెన్ అవర్ డీల్స్
ప్రతి రోజూ రాత్రి 8 గంటలకి గోల్డెన్ అవర్ డీల్స్‌ను కూడా అమెజాన్ అందించనుంది. ఈ సేల్‌లో స్మార్ట్ఫోన్లపై 40 శాతం వరకు, ఎలక్ట్రానిక్ ఉత్పత్తులపై 60 శాతం వరకు, టీవీలు & అప్లయన్సెస్‌పై 60 శాతం వరకు, అమెజాన్ ఫ్యాషన్ పై 80 శాతం వరకు, హోమ్ & ఫర్నిచర్ పై 80 శాతం వరకు, బుక్స్, గేమింగ్స్ పై 70 శాతం వరకు, డైలీ ఎస్సెన్సియల్స్ పై 70 శాతం వరకు, అమెజాన్ ఉత్పత్తులపై (ఎకో, ఫైర్ టీవీ స్టిక్, కిండిల్) 45 శాతం వరకు, అమెజాన్ బ్రాండ్స్ పై 60 శాతం వరకు డిస్కౌంట్‌ను అందించనుంది.
ఇదీ చూడండి: ప్రతి ఉద్యోగి సూపర్ యాన్యుయేషన్ గురించి తెలుసుకోవాల్సిందే!