భారతీయ మొబైల్ యూజర్లకు సరికొత్త ఇంటర్నెట్ అనుభూతిని అందించాలనే ఉద్దేశంతో రిలయన్స్ జియో సంస్థ కొత్తగా జియోఫోన్ నెక్స్ట్‌ను(jio phone next) తీసుకొస్తున్నట్లు ప్రకటించింది. ఇతర కంపెనీలకు చెందిన బడ్జెట్ ఫోన్లలో ఉండే ఫీచర్లతో రూ.6,499 ధరకే(jio phone next price) జియోఫోన్ నెక్స్ట్‌ను అందివ్వనున్నట్లు తెలిపింది. ఇందుకోసం జియో సంస్థ వినియోగదారులకు నాలుగు రకాల ప్లాన్లు అందుబాటులోకి తీసుకొచ్చింది. మరి దీపావళి రోజు(నవంబర్ 4న) విడుదల అవుతున్న ఈ ఫోన్‌ను ఎలా కొనుగోలు చేయాలి? మీ దగ్గర్లోని స్టోర్‌లో జియోఫోన్ నెక్స్ట్ అందుబాటులోకి వచ్చిందా? లేదా?(jio phone next booking) అనేది ఎలా తెలుసుకోవాలో చూద్దాం.
- ముందుగా జియో వెబ్‌సైట్‌లోకి వెళితే జియోఫోన్ నెక్ట్స్ ఫొటో కనిపిస్తుంది. అందులో ‘Know More’ ఆప్షన్‌పై క్లిక్ చేస్తే జియో ఫోన్‌కు సంబంధించిన పేజ్ ఓపెన్ అవుతుంది.
- అందులో ‘I am Interested’ అనే బటన్‌పై క్లిక్ చేసి మీ పేరు, మొబైల్ నంబర్ వివరాలు నమోదు చేయాలి. తర్వాత మీ మొబైల్‌కు వచ్చిన ఓటీపీ ఎంటర్ చేస్తే మరో పేజ్ ఓపెన్ అవుతుంది.
- అక్కడ మీ అడ్రస్, ప్రాంతం, పిన్‌కోడ్ వంటి వివరాలు నమోదు చేయాలి. తర్వాత మీ ప్రాంతంలో జియోఫోన్ నెక్ట్స్ అమ్మకాలు ప్రారంభమైనప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుందనే మెసేజ్ మీ ఫోన్‌కు వస్తుంది. అలా జియో ఫోన్ అమ్మకాలకు సంబంధించిన సమాచారం ముందుగానే మీకు తెలుస్తుంది.
జియో, గూగుల్ సంయుక్తంగా తీసుకొస్తున్న ఈ ఫోన్ ఫీచర్లు(jio phone next features) ఖరీదైన ఫోన్‌కు ఏమాత్రం తీసిపోకుండా ఉన్నాయి.
సరికొత్త ఓఎస్‌తో..
జియోఫోన్ నెక్స్ట్(JioPhone Next news) కోసం గూగుల్, జియో సంయుక్తంగా సరికొత్త ప్రగతి ఆపరేటింగ్ సిస్టమ్‌ను(ఓఎస్) రూపొందించాయి. తక్కువ ధరకు గొప్ప అనుభూతిని అందిస్తూనే.. అందరినీ 'ప్రగతి'లోకి తీసుకురావాలనే లక్ష్యంతో జియో, గూగుల్‌లోని అత్యుత్తమ టెకీలు దీనిని అభివృద్ధి చేశారని జియో ప్రతినిధులు వెల్లడించారు. ఈ ఓఎస్‌ను కేవలం భారత్ కోసమే అభివృద్ధి చేసినట్లు పేర్కొన్నారు.
జియోఫోన్ నెక్స్ట్లో(jio phone next price and specifications).. క్వాల్కామ్ ప్రాసెసర్‌ను అమర్చారు. దీంతో ఫోన్ పనితీరు, ఆడియో, బ్యాటరీలో ఆప్టిమైజేషన్‌లతో పాటు కనెక్టివిటీ, లొకేషన్ టెక్నాలజీ వంటివి సమర్థంగా పని చేస్తాయని జియో ప్రతినిధులు తెలిపారు.
ఫీచర్ల వివరాలు
వాయిస్ అసిస్టెంట్
వాయిస్ అసిస్టెంట్.. ఫోన్‌ను ఆపరేట్ చేయడం, యాప్స్‌ను తెరవడం సహా ఎన్నో రకాలుగా యూజర్‌కు ఉపయోగపడుతుంది. దీని సాయంతో వినియోగదారుడికి తెలిసిన భాషలో ఇంటర్నెట్ నుంచి సమాచారం/కంటెంట్‌ను సులభంగా పొందవచ్చు.
రీడ్ అలౌడ్
స్క్రీన్‌పై ఉన్న కంటెంట్‌ను స్పష్టంగా, గట్టిగా చదివి వినిపించే సౌకర్యం ఈ ఫోన్లో ఉంది. ఫలితంగా అంధులు సైతం ఈ ఫోన్‌ను వినియోగించుకోవచ్చు.
అనువాదం
యూజర్‌కు కావాల్సిన భాషలో అత్యంత సులభంగా, సమర్థంగా ఒక భాష నుంచి మరొక భాషలోకి అనువాదించేలా జియోఫోన్ నెక్స్ట్‌ను రూపొందించారు. దీంతో వినియోగదారుడికి అనువైన భాషలో కంటెంట్ చదువుకోవడానికి ఉపయోగపడుతుంది.
స్మార్ట్ కెమెరా..
ఈ ఫోన్‌కు శక్తిమంతమైన, స్మార్ట్ కెమెరాను అమర్చారు. దీంతో నచ్చిన మోడ్లలో అద్భుతమైన ఫొటోలు తీసుకోవచ్చు. అలాగే ఆటోమెటిక్‌గా బ్యాగ్రౌండ్ బ్లర్ అయ్యే సౌకర్యం ఉంది. నైట్ మోడ్ ద్వారా తక్కువ కాంతిలో కూడా హైక్వాలిటీ ఫొటోలు తీసుకోవచ్చు.
ప్రీలోడెడ్‌గా జియో, గూగుల్ యాప్‌లు
గూగుల్ ప్లేస్టోర్‌లో అందుబాటులో ఉన్న అన్ని ఆండ్రాయిడ్ యాప్‌లను ఈ ఫోన్ సపోర్ట్ చేస్తుంది. జియో, గూగుల్ యాప్‌లను కొన్నింటిని డిఫాల్ట్‌గా లోడ్ చేశారు.
ఆటోమెటిక్ సాఫ్ట్‌వేర్ అప్‌డేట్
జియోఫోన్ నెక్స్ట్ సాఫ్ట్‌వేర్ ఎప్పటికప్పుడు ఆటోమేటిక్‌గా అప్‌డేట్ అయ్యే ఆప్షన్‌ను ఇందులో ఉంది. ఫలితంగా ఫోన్.. తాజా ఫీచర్‌లతో వేగంగా పని చేస్తుంది.
బ్యాటరీ
ఈ ఫోన్‌ను ప్రత్యేక ప్రగతి ఓఎస్‌ను ఆండ్రాయిడ్‌తో రూపొందించారు. ఇది బ్యాటరీ జీవితకాలానికి భరోసానిస్తూ.. పనితీరును మెరుగుపరుస్తుంది.
రూ.1,999 చెల్లించి..
ఈ స్మార్ట్‌ఫోన్‌ను(new jio phone next 2021) కొనుగోలు చేయాలనుకునే వారి కోసం జియో నాలుగు ప్లాన్లు ప్రకటించింది. అవి ఆల్వేస్ ఆన్, లార్జ్, ఎక్స్‌ఎల్, డబుల్ ఎక్స్‌ఎల్. వీటితో రీఛార్జి ప్లాన్లు కలిపి ఉంటాయి. ముందుగా రూ. 1,999 చెల్లించి ఈ ఫోన్‌ను సొంతం చేసుకోవచ్చు. మిగిలిన మొత్తాన్ని 18 లేదా 24 నెలల కాల వ్యవధిలో చెల్లించవచ్చు.
ఇదీ చదవండి: 5జీ ట్రయల్స్‌లో వొడాఫోన్ ఐడియా నయా రికార్డు!