ETV Bharat / business

బంగారంపై పెట్టుబడి పెట్టాలా? అయితే ఇది చదవాల్సిందే - బంగారం పెట్టుబడులు

ఇటీవలి సమయంలో పసిడిపై భారీగా పెట్టుబడులు పెరిగాయి. ఇందుకు ప్రధాన కారణం కరోనా ప్రభావం కారణంగా.. ఇతర పెట్టుబడి సాధనాల్లో రిటర్నులు తగ్గిపోయాయి. బంగారం మాత్రం మంచి రిటర్నులు ఇచ్చింది. ఈ కారణంగా పుత్తడినే చాలా మంది సురక్షిత పెట్టుబడిగా భావిస్తున్నారు. మరీ మీరు బంగారంపై పెట్టుబడి పెట్టాలనుకుంటే ఈ విషయాలు తప్పకుండా తెలుసుకోవాల్సిందే.

All you need to know about gold investment
బంగారంపై పెట్టబడి పెట్టాలా? ఇది మీకోసమే
author img

By

Published : Aug 23, 2020, 10:41 AM IST

కరోనా విజృంభణతో ప్రపంచవ్యాప్తంగా గతంలో ఎన్నడూ చూడనంతగా ఆర్థిక అనిశ్చిత పరిస్థితులు నెలకొన్నాయి. దీనితో పెట్టుబడి సాధనాల్లో భారీ మార్పులు వచ్చాయి. ప్రపంచవ్యాప్తంగా అన్ని స్టాక్ మార్కెట్లు ఓ కుదుపునకు లోనయ్యాయి. ఇలాంటి సంక్షోభ పరిస్థితుల్లోనూ ఒక పెట్టుబడి సాధనం మాత్రం లాభాల పంట పండించింది. అదే బంగారం.. చాలా మంది బంగారమే ప్రస్తుత పరిస్థితుల్లో సురక్షితమని భావించి.. భారీగా పెట్టుబడులు పెట్టారు. దీనితో పసిడి డిమాండ్ విపరీతంగా పెరిగిపోయింది. ఒకానొక దశలో 10 గ్రాముల స్వచ్ఛమైన పసిడి ధర రూ.57 వేలు దాటింది అంటే.. డిమాండ్ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.

మరి ఇలాంటి పరిస్థితుల్లో మీరు బంగారంపై పెట్టుబడి పెట్టాలనుకుంటే ఈ విషయాలు తెలుసుకోండి.

బంగారంపై సురక్షిత పెట్టుబడుల్లో మ్యూచువల్‌ ఫండ్ల విధానం ఒకటి. వీటి ద్వారా పెట్టుబడి పెడితే.. తయారీ ఖర్చులు, నాణ్యత, భద్రత, బీమా వంటి వాటి గురించి ఆలోచించాల్సిన అవసరం ఉండదు. గోల్డ్ మ్యూచ్​వల్​ ఫండ్లలో 4 విధానాలు ఉన్నాయి. అవి.. గోల్డ్‌ ఫండ్లు, గోల్డ్‌ ఈటీఎఫ్‌లు, మల్టీ అసెట్‌ ఫండ్లు, అంతర్జాతీయ గోల్డ్‌ ఫండ్లు.

గోల్డ్ ఈటీఎఫ్‌లు…

ఈటీఎఫ్‌ అంటే ఎక్సైంజీ ట్రేడెడ్‌ ఫండ్‌. ఇవి స్టాక్‌ ఎక్స్చేంజీలలో ట్రేడవుతుంటాయి. ఇవి భౌతిక బంగారంపై పెట్టుబడి పెడుతుంటాయి. ఒక్క గోల్డ్ ఈటీఎఫ్‌ యూనిట్‌ సగం గ్రాము 24 క్యారెట్ల బంగారానికి సమానం. గోల్డ్‌ ఈటీఎఫ్‌లనూ.. ఎక్స్చేంజీలలో కావాల్సినప్పుడు విక్రయించుకోవచ్చు. అందువల్ల దీనికి లిక్విడిటీ ఎక్కువ. భౌతిక బంగారం ధరలకు అనుగుణంగా ఈ ఈటీఎఫ్‌లు ట్రేడవుతుంటాయి. మార్కెట్‌ ధరలను బట్టి విక్రయించుకోవచ్చు.

ఇదీ చూడండి:- గోల్డ్ ఈటీఎఫ్​లలో పెట్టుబడులు 86 శాతం వృద్ధి

గోల్డ్‌ ఫండ్లు..

మార్కెట్​పై మీకు అవగాహన లేనప్పుడు.. మీ తరఫున ఈటీఎఫ్​లలో పెట్టుబడి పెట్టే సాధనాల్లో.. ఈ గోల్డ్ ఫండ్లు ఒకటి. వీటిలో పెట్టుబడి పెట్టేందుకు డీమ్యాట్‌ అకౌంట్‌ అవసరం లేదు. ఇతర మ్యూచువల్‌ ఫండ్లలాగే గోల్డ్ ఫండ్లలో కూడా పెట్టుబడి, విక్రయాలు జరుపుకోవచ్చు.

మల్టీ అసెట్‌ అలోకేషన్‌ ఫండ్‌….

ఇది హైబ్రీడ్‌ ఫండ్‌. ఇందులో 10 శాతం వేరు వేరు సాధనాల్లో పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. ఎక్కువ ఫండ్లు బంగారంలో పెట్టుబడి పెడుతుంటాయి. అయితే ఇందులో బంగారంపై మాత్రమే పెట్టుబడిని పెట్టేందుకు వీలుండదని వ్యక్తిగత ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. కేవలం బంగారంపై పెట్టుబడి పెట్టాలంటే ఇతర అవకాశాలు కూడా ఉన్నాయని సూచిస్తున్నారు.

ఇంటర్నేషనల్‌ గోల్డ్ ఫండ్లు…

మార్కెట్‌లో కొన్ని అంతర్జాతీయ గోల్డ్‌ ఫండ్లు అందుబాటులో ఉన్నాయి. విదేశీ గోల్డ్‌ ఫండ్లపై పెట్టుబడికి ఇవి ఉపయోగపడుతాయి. అయితే ఈ ఫండ్లు కాస్త రిస్కుతో కూడుకున్నవని నిపుణులు అంటున్నారు. అంతర్జాతీయ పరిస్థితులను అంచనా వేసే వారు మాత్రమే వీటిని సరిగ్గా డీల్​ చేయగలరని సూచిస్తున్నారు.

ఇదీ చూడండి:- స్వల్పంగా తగ్గిన పసిడి ధర- వెండి మరింత ప్రియం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.