ETV Bharat / business

సెబీ ఛైర్మన్​ త్యాగి పదవీ కాలం పొడిగింపు - SEBI news

సెబీ ఛైర్మన్​ అజయ్​ త్యాగి పదవీ కాలాన్ని మరో 18 నెలల పాటు పొడిగించింది కేంద్రం. త్యాగి పదవీకాలం పొడిగింపునకు కేబినెట్ నియామకాల కమిటీ ఆమోదం తెలిపింది.

SEBI chairman
సెబీ ఛైర్మన్​ అజయ్​ త్యాగి పదవీ కాలం పొడిగింపు
author img

By

Published : Aug 5, 2020, 10:12 PM IST

Updated : Aug 6, 2020, 2:38 PM IST

మార్కెట్​ నియంత్రిత సంస్థ సెక్యూరిటీస్ అండ్​ ఎక్చ్సేంజి బోర్డ్​ ఆఫ్ ఇండియా (సెబీ) ఛైర్మన్​ అజయ్​ త్యాగి పదవీ కాలాన్ని పొడిగించింది కేంద్రం. 2022 ఫిబ్రవరి వరకు మరో 18 నెలల పాటు సెబీ ఛైర్మన్​గా కొనసాగనున్నారు త్యాగి.

ఇందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేబినెట్​ నియామకాల కమిటీ ఆమోదం తెలిపింది. ఈ మేరకు కేంద్రం ఆదేశాలు 2020 సెప్టెంబర్​ 1 నుంచి 2022, ఫిబ్రవరి 28 వరకు అమలులో ఉండనున్నాయి.

మరోమారు..

1984 బ్యాచ్​ హిమాచల్​ ప్రదేశ్​ కేడర్ ఐఏఎస్​ అధికారి త్యాగి.. సెబీ ఛైర్మన్​గా 2017 మార్చిలో నియమితులయ్యారు. మూడేళ్ల పదవీ కాలం ముగిసిన నేపథ్యంలో ఇప్పటికే ఈ ఏడాది తొలినాళ్లలో మొదటిసారి ఆగస్టు వరకు పదవీ కాలాన్ని పొడిగించారు. తాజాగా మరోమారు త్యాగినే ఛైర్మన్​గా కొనసాగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ​

ఇద చూడండి: అయోధ్యలో రామమందిర నిర్మాణానికి అంకురార్పణ

Last Updated : Aug 6, 2020, 2:38 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.