ETV Bharat / business

5జీ టెస్ట్​లో ఎయిర్​టెల్ అదుర్స్​- 1జీబీపీఎస్ స్పీడ్! - ఎయిర్​టెల్ 5జీ ట్రయల్స్ ముంబయి

5జీ ట్రయల్స్​లో ఎయిర్​టెల్ 1 జీబీపీఎస్ వేగాన్ని అందుకుంది. ముంబయిలో ఈ పరీక్షలు నిర్వహించగా.. అంతర్జాల వేగం సెకనుకు 1 జీబీపీఎస్​ను దాటిందని సంబంధిత వర్గాలు తెలిపాయి. త్వరలో కోల్​కతాలోనూ ఈ ట్రయల్స్ నిర్వహించనున్నట్లు స్పష్టం చేశాయి.

AIRTEL 5G NOKIA
5జీ ట్రయల్స్​లో ఎయిర్​టెల్ 1జీబీపీఎస్ స్పీడ్
author img

By

Published : Jul 12, 2021, 7:05 PM IST

5జీ ఫీల్డ్ ట్రయల్స్​లో భారతీ ఎయిర్​టెల్ సత్తా చాటింది. ముంబయిలో నిర్వహించిన ప్రయోగాల్లో ఏకంగా 1 జీబీపీఎస్ వేగాన్ని అందుకుంది. నోకియా నెట్​వర్క్​ గేర్​ను ఉపయోగించి ఈ ట్రయల్స్ చేపట్టినట్లు తెలుస్తోంది.

ముంబయి ఫీనిక్స్ మాల్​లోని లోవర్ పరేల్​లో ఎయిర్​టెల్ ఈ 5జీ ట్రయల్స్​ను చేపడుతోంది.

"టెలికాం శాఖ మార్గదర్శకాలను అనుసరించి ప్రకారం ఎయిర్​టెల్.. 3500 మెగా హెర్జ్ బ్యాండ్​లో ఈ ట్రయల్స్ చేపడుతోంది. ట్రయల్స్​లో ఇంటర్నెట్ వేగం 1 జీబీపీఎస్ దాటింది. త్వరలో కోల్​కతాలోనూ 5జీ ట్రయల్స్ చేపట్టాలని ఎయిర్​టెల్, నోకియా సంస్థలు భావిస్తున్నాయి."

-విశ్వసనీయ వర్గాలు

ఎయిర్​టెల్​కు 3500 మెగా హెర్జ్, 28 గిగా హెర్జ్, 700 మెగా హెర్జ్ బ్యాండ్​ల 5జీ స్పెక్ట్రమ్​ను టెలికాం శాఖ కేటాయించింది.

తొలిసారి లైవ్ నెట్​వర్క్​ ద్వారా హైదరాబాద్​లో 5జీ టెస్ట్ నిర్వహించింది ఎయిర్​టెల్. ఇందుకోసం 1800 మెగా హెర్జ్ బ్యాండ్​ను ఉపయోగించింది. ముంబయి, కోల్​కతాతో పాటు, దిల్లీ, బెంగళూరు నగరాల్లోనూ 5జీ ట్రయల్స్ నిర్వహించేందుకు ఎయిర్​టెల్​కు అనుమతులు ఉన్నాయి.

ఇదీ చదవండి: త్రివర్ణ పతాకం, సైన్యం చిహ్నంతో జావా కొత్త బైకులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.