ETV Bharat / business

ఎయిర్​ ఇండియా ప్రైవేటీకరణ ఇప్పట్లో కష్టమే!

author img

By

Published : Dec 20, 2020, 1:44 PM IST

ఎయిర్ ఇండియా ప్రైవేటీకరణ ప్రక్రియ ఈ ఆర్థిక సంవత్సరంలో పూర్తి అయ్యే అవకాశాలు లేవని అధికారులు తెలిపారు. వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఈ ప్రక్రియ ముగుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అప్పుల్లో కూరుకుపోయిన ఎయిర్​ ఇండియాను కొనుగోలు చేసేందుకు బిడ్లు దాఖలు చేసిన వారిలో టాటా గ్రూప్, అమెరికాకు చెందిన ఫండ్ ఇంటరప్స్​ సైతం ఉన్నాయి.

Air India privatisation unlikely to conclude this fiscal
వచ్చే ఏడాదిలో ఎయిర్ ఇండియా ప్రైవేటీకరణ

అప్పుల్లో కూరుకుపోయిన ప్రభుత్వ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా ప్రైవేటీకరణ ప్రక్రియ ఇప్పట్లో పుర్తి అయ్యే అవకాశాలు కనిపించడం లేదు. వచ్చే ఆర్థిక సంవత్సరం వరుకు ఇది కొనసాగుతుందని సంబంధిత అధికారులు తెలిపారు. కొనుగోలుకు ఆసక్తి వ్యక్తీకరణ(ఈఓఐ) బిడ్లను దాఖలు చేసిన వారి వివరాలు జనవరి 6న వెల్లడవుతాయన్నారు. టాటా గ్రూప్, అమెరికాకు చెందిన ఫండ్ ఇంటరప్స్​ సంస్థలు.. బిడ్లు దాఖలు చేసిన వాటిలో ఉన్నాయి. బిడ్లకు అనుమతి పొందిన వారికి ఎయిర్ ఇండియాకు చెందిన వర్చువల్ డేటా రూమ్​(వీడీఆర్​)కు అనుమతి లభిస్తుందని అధికారులు తెలిపారు. బిడ్లు దాఖలు చేసిన వారు సందేహాలను నివృత్తి చేసుకుంటారు కాబట్టి ప్రైవేటీకరణ ప్రక్రియ ఆలస్యం అవుతుందని అభిప్రాయపడ్డారు.

ఆది నుంచి నష్టాల్లో

ఎయిర్ ఇండియా సంస్థ 2007 నుంచి నష్టాల్లో కొనసాగుతోంది. దీంతో 100శాతం వాటాను విక్రయించేందుకు సిద్ధపడింది. కరోనా వల్ల సంస్థ విక్రయానికి గడువును పదే పదే పొడగిస్తూ వచ్చింది ప్రభుత్వం. డిసెంబరు 14 గడువు ముగిసే సమయానికి అమెరికాకు చెందిన ఫండ్ ఇంటరప్స్ సంస్థతో కలిసి 200 మంది ఎయిర్ ఇండియా ఉద్యోగులు ఈఓఐ పత్రాలు సమర్పించారు.

కొనుగోలు సంస్థ ఆధీనంలోకి

ఎయిర్ ఇండియాకు సంబంధించిన 4,400 దేశీయ, 18 వందల అంతర్జాతీయ ల్యాండింగ్​, పార్కింగ్ స్లాట్లు, విదేశాల్లోని 900 స్లాట్లు.. కొనుగోలు చేసిన సంస్థ ఆధీనంలోకి వెళతాయి. దీంతోపాటు దేశంలోని ప్రధాన విమానాశ్రయాల్లో వంద శాతం కార్గో సేవలు తక్కువ ధరకే ఆ సంస్థకు అందుతాయి. గతంలో కంటే ప్రస్తుతం విక్రయ ఒప్పందాన్ని కేంద్రం సులభతరం చేసింది. కొనుగోలు చేసే సంస్థ ఎంత వరకు రుణాలు చెల్లిస్తారో వారే నిర్ణయించుకునే వెసలుబాటు కల్పించింది. అయితే గతంలో రూ.60,074 కోట్ల రుణాలు చెల్లించాల్సిందిగా ఉన్న నిబంధనను రద్దు చేసింది.

ఇదీ చదవండి : ఎయిర్​ ఇండియా కొనుగోలుకు టాటా గ్రూప్​ బిడ్​

ఇదీ చదవండి : ఎయిర్​ ఇండియాకు టాటాల టేకాఫ్‌?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.