ETV Bharat / business

సాగుకూ కరోనా 'తెగులు'- సంక్షోభంలో వ్యవసాయ రంగం

కరోనా భయాలు ప్రపంచాన్ని వణికిస్తున్న వేళ.. ఆ ప్రభావం వ్యవసాయ రంగంపైనా పడే అవకాశముంది. కరోనా ధాటికి ప్రపంచ దేశాలు తమ సరిహద్దులను మూసేస్తున్నాయి. ఫలితంగా విత్తన ఎగుమతులు, దిగుమతులకు తీవ్ర అంతరాయం కలగనుంది. అలాగే ప్రజలు నిర్బంధంలో ఉండాల్సిన పరిస్థితులు తలెత్తడం.. కూలీల కొరతకు దారితీస్తుంది. సరైనా ముందు జాగ్రత్తలు తీసుకుంటేనే రానున్న సమస్యల నుంచి సులువుగా గట్టెక్కే అవకాశం ఉంటుంది.

Agriculture affected  by corona pest
వ్యవసాయంపై కరోనా ప్రభావం
author img

By

Published : Mar 20, 2020, 8:54 AM IST

ప్రాణాంతకమైన సార్స్‌ సీఓవీ-2 వైరస్‌ ముట్టడితో మానవాళి భయం గుప్పిట్లో చిక్కుకుంది. కొవిడ్‌-19 జబ్బు పేరు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా ప్రాచుర్యం పొందింది. ప్రస్తుతం కరోనా వైరస్‌ ప్రబలుతున్న తరుణంలో పదిమందిలో ఎవరైనా తుమ్మినా, దగ్గినా అందరూ అనుమానస్పదంగా చూస్తున్నారు. ఇతర ప్రభుత్వాల మాదిరిగానే భారత ప్రభుత్వం, ప్రపంచ ఆరోగ్య సంస్థ ఈ మహమ్మారిని అరికట్టేందుకు తీవ్రస్థాయిలో కృషి చేస్తున్నాయి. కానీ, ముప్పు మన చుట్టూ పొంచి ఉంది. చైనా వంటి ఆర్థిక శక్తి ఈ వ్యాధికి బలవగా, ఇరాన్‌ అతలాకుతలమవుతోంది. కొవిడ్‌-19 తమను గట్టి దెబ్బ కొట్టకముందే భారత్‌తోపాటు, సార్క్‌ దేశాలు పూర్తి శక్తితో సంసిద్ధమయ్యాయి. కొవిడ్‌-19 భయం భారత్‌తోపాటు, ప్రపంచాన్ని కమ్మేసింది. అయితే, ప్రస్తుతం ప్రపంచానికి కరోనా వైరస్‌కన్నా, దానికి సంబంధించిన భయమే పెద్ద ముప్పు కలిగించేదిగా ఉంది. నల్లబజార్లు ఇప్పటికే మాస్కులు, సబ్బులు, కీటకనాశినులు తదితర కొత్తరకం సరకుల్ని చెలామణీలోకి తీసుకొచ్చాయి.

వ్యవసాయ రంగం

మానవాళి మనుగడకు వ్యవసాయమే కీలక ఆధారం. ప్రస్తుతం చాలా వరకు మన వ్యవసాయం నాణ్యమైన విత్తనాలపై, ప్రపంచవ్యాప్తంగా ఉన్న సంఘటిత విత్తన రంగంపై ఆధారపడి ఉంది. మానవ వనరులు, వ్యవసాయ కూలీల లభ్యత, విత్తనాలు, ఎరువులు వంటి వ్యవసాయ సంబంధ వస్తువులు స్వేచ్ఛగా తరలడంపై ఆహార ఉత్పత్తి ఆధారపడి ఉంటుంది. ఐరోపా సమాఖ్య తరహాలోనే అమెరికా సైతం తన సరిహద్దుల్ని మూసేసుకుంది. ప్రస్తుతం ప్రపంచమంతా వీసాల్ని రద్దు చేసి, ప్రజల ప్రయాణాలపై ఆంక్షల్ని విధిస్తోంది. పలు దేశాల్లో ప్రజలు బయటికొచ్చేందుకు భయపడుతున్నారు. జనసమ్మర్దంగా ఉండే ప్రదేశాల వైపే వెళ్లడం లేదు. వియత్నాం నుంచి ఇటలీ దాకా విద్యాసంస్థల్ని మూసేశారు. వీధులన్నీ నిర్మానుష్యంగా మారాయి. ప్రస్తుత పరిస్థితుల్ని చూస్తుంటే వ్యవసాయ కూలీల అందుబాటు తక్కువగా ఉండేలా కనిపిస్తోంది. ఈ సీజన్‌లో వ్యవసాయ కూలీల వేతనాలూ పెరిగే అవకాశం ఉంది. ఆహార పదార్థాల ఉత్పత్తి వ్యయాలు పెరగనున్నాయి. కోళ్ల రంగంలో ముప్పు మరింత అధికంగా ఉంది. కోడిమాంసం ధరలు దారుణంగా పడిపోయాయి. భయాందోళనలు పెరిగిన కారణంగా కోళ్ల ఫారాల్లో పని చేసేందుకు శ్రామికులు తిరస్కరిస్తున్నారు.

విత్తన రంగం

ప్రపంచ విత్తన రంగం సరఫరా వ్యవస్థ పైనే ఎక్కువగా ఆధారపడి ఉంటుంది. ఏ ఒక్క దేశానికీ విత్తనాల విషయంలో సార్వభౌమత్వం లేదు. ఓడరేవుల్ని, విత్తనాల రవాణాను నిలిపి వేయడం వల్ల ఈ ఏడాదిలో వ్యవసాయ ఉత్పాదకతపై ప్రభావం పడే అవకాశం ఉంది. ప్రపంచవ్యాప్తంగా మార్చి, ఏప్రిల్‌ నెలలు విత్తనాలు వేసేందుకు అనువైనవి. మొక్కజొన్న, పొద్దుతిరుగుడు, సోయాబీన్‌, గోధుమ, బార్లీ, కూరగాయలు వంటివి ఈ సీజన్‌లోనే వేస్తారు. భారత్‌లో సైతం పంటల కాలం మొదలు కానుంది. విత్తనాలు లేకపోవడం, ఆలస్యంగా అందుబాటులోకి రావడం వంటి కారణాలతో రైతులు విత్తడంలో ఆలస్యం చేస్తే ఈ ఏడాది తదనంతర కాలంలో తీవ్రస్థాయిలో ఆహార కొరతతోపాటు, ఆహార ధరల ద్రవ్యోల్బణం సంభవించే అవకాశం ఉంది.

ముప్పు పొంచి ఉందా?

ఐరోపా ఆహార సురక్షిత ప్రాధికార సంస్థ (ఈఎఫ్‌ఎస్‌ఏ), వ్యాధి నియంత్రణ, నివారణ కేంద్రం (సీడీసీ) తదితర సంస్థల ప్రకటనల్ని ప్రస్తావిస్తూ ఇటీవల అంతర్జాతీయ విత్తన సమాఖ్య (ఐఎస్‌ఎఫ్‌) చేసిన ప్రకటన ప్రకారం- వైరస్‌ వ్యాప్తికి ఆహార పదార్థాలు లేదా విత్తనాలు కారణమవుతాయని చెప్పేందుకు ఇప్పటికైతే ఆధారాలు లేవని పేర్కొంది. అందుకని విత్తనాల విషయంలో ఆందోళన పడాల్సిన అవసరం లేదని స్పష్టంచేసింది. ప్రస్తుత సమయంలో అందరూ ధైర్యాన్ని సమకూర్చుకోవాలి. పూర్తిస్థాయిలో సమాచారం పొందుతూ అవగాహన పెంపొందించుకోవాలి. శాస్త్రీయ సాక్ష్యాల ఆధారంగా నిర్ణయాలు తీసుకోవాలి. అప్పుడే కొవిడ్‌-19ని సమర్థంగా ఎదుర్కోవచ్ఛు ఈ వైరస్‌ మన ఆరోగ్యానికి మాత్రమే కాకుండా మన వ్యవసాయ రంగానికీ ముప్పులా పరిణమించింది. అందుకని, కేంద్ర సర్కారుతోపాటు, ప్రపంచంలోని ఇతర ప్రభుత్వాలు విత్తనాలు సహా వ్యవసాయ ఉత్పత్తులపై ఎలాంటి ఆంక్షలు విధించకూడదు. విత్తనాల రవాణాకు సంబంధించిన రంగంలో పనిచేసే శ్రామికుల ఆరోగ్యం, క్షేమానికి సంబంధించిన బాధ్యతల్ని విత్తన కంపెనీలు, ఎగుమతి దారులు తలకెత్తుకోవాలి. సరకు రవాణా, శ్రామికుల పరీక్షల కార్యకలాపాలకు సంబంధించి ఓడరేవుల అధికారులు రాబోయే కాలంలో తీవ్రస్థాయిలో శ్రమించాల్సి ఉన్న నేపథ్యంలో వారికి సహాయ సహకారాలు అందించాల్సి ఉంటుంది. వైరస్‌ వ్యాప్తికి సంబంధించి ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇటీవల వెలువరించిన సూచనలకు ప్రచారం కల్పించాల్సి ఉంది. వైరస్‌ల వ్యాప్తిలో విత్తనాల రవాణా ద్వారా సంభవించే ముప్పు చాలా తక్కువ. అందుకని వీటి రవాణాను ఆపకూడదు. ఆలస్యమూ చేయరాదు. ప్రస్తుత సంక్షోభ సమయంలో ప్రపంచమంతా ముందుకొచ్చి కరోనా వైరస్‌పై మాత్రమే కాకుండా, దానికి సంబంధించిన భయంపైనా పోరాటం సాగించాలి.

- ఇంద్ర శేఖర్ సింగ్

(రచయిత - భారత జాతీయ విత్తన సంఘం సంచాలకులు)

ఇదీ చూడండి: చైనాను దాటిన ఇటలీ- 3,400కు చేరిన కరోనా మృతులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.