ETV Bharat / business

అదానీ గ్రీన్​ రూ.25వేల కోట్ల​ భారీ ఒప్పందం! - adani deal with soft softbank energy

దేశంలోని గ్రీన్​ ఎనర్జీ రంగంలో భారీ ఒప్పందం కుదిరింది. ఎస్​బీ ఎనర్జీ ఇండియాలో వంద శాతం వాటా కొనుగోలుకు అదానీ గ్రీన్​ ఎనర్జీ 3.5 బిలియన్​ డాలర్లతో కీలక ఒప్పందం చేసుకుంది.

AGEL
రూ.25వేల కోట్లతో అదానీ గ్రీన్​ భారీ ఒప్పందం
author img

By

Published : May 19, 2021, 12:03 PM IST

ఎస్​బీ ఎనర్జీ ఇండియాలో వంద శాతం వాటా కొనుగోలుకు అదానీ గ్రీన్​ ఎనర్జీ లిమిటెడ్​(ఏజీఈఎల్​) భారీ ఒప్పందం కుదుర్చుకుంది. ఇందుకుగాను సాఫ్ట్ బ్యాంక్​ గ్రూప్​​, భారతీ గ్రూప్​లతో ఒప్పందం చేసుకుంది. దీని విలువ 3.5 బిలియన్​ డాలర్లు (సుమారు రూ. 25 వేల కోట్లు )అని తెలిపింది సంస్థ.

గ్రీన్​ ఎనర్జీ రంగానికి సంబంధించి భారత్​లో ఇదే అతిపెద్ద ఒప్పందం కావడం విశేషం. ఎస్​బీ ఎనర్జీలో సాఫ్ట్ బ్యాంక్​కు 80 శాతం, భారతీ గ్రూప్​నకు 20 శాతం వాటా ఉండేది. అయితే ఈ మొత్తాన్ని అదానీ గ్రీన్​ సొంతం చేసుకున్నట్లుగా ఒప్పందంపై సంతకాలు చేశాయని పేర్కొంది.

ఎస్​బీ ఎనర్జీ దేశంలోని నాలుగు రాష్ట్రాల్లో పునరుత్పాదక ప్లాంట్లను ఏర్పాటు చేసింది. వీటి నుంచి సుమారు 4,954 మెగావాట్ల మేర విద్యుత్​ ఉత్పత్తి జరుగుతోంది. వాటిలో 84 శాతం సోలార్​ ఎనర్జీ (4,180ఎండబ్ల్యూ), విండ్-సోలార్ ఎనర్జీ 9 శాతం(450ఎండబ్ల్యూ), కేవలం విండ్​ నుంచి 7 శాతం (324ఎండబ్ల్యూ)​ల విద్యుత్​ ఉత్పత్తి జరుగుతుంది. మరికొన్ని ప్రాజెక్టులు ఇప్పటికే నిర్మాణ దశలో ఉన్నాయి.

ఇదీ చూడండి: అమెజాన్ షాపింగ్​ యాప్​లో ఫ్రీగా వెబ్​ సిరీస్​లు!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.