ETV Bharat / business

అమెజాన్ 'ఫ్రీడమ్​ సేల్​'లో 70శాతం వరకు డిస్కౌంట్​! - amazon latest sale news

రెండు రోజుల ప్రైమ్​ సేల్ ముగిసిన మరునాడే ఆగస్టు 8 నుంచి నాలుగు రోజుల పాటు 'ఫ్రీడమ్​ సేల్' నిర్వహించనున్నట్లు ప్రకటించింది ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్​. అనేక వస్తువులపై 70శాతం వరకూ డిస్కౌంట్​తో బంపర్ ఆఫర్లు అందుబాటులో ఉంచనున్నట్లు తెలిపింది. క్రెడిట్​ కార్డు వినియోగదారులు రూ.1500 వరకు అదనపు డిస్కౌంట్​​ పొందవచ్చని పేర్కొంది.​

After Prime Day, Amazon India announces 4-day 'Freedom Day' sale
అమెజాన్ ఫ్రీడమ్​ సేల్​లో 70శాతం వరకు డిస్కౌంట్​
author img

By

Published : Aug 8, 2020, 8:45 PM IST

ఆగస్టు 8నుంచి 11వరకు నాలుగు రోజుల పాటు 'ఫ్రీడమ్​ సేల్'​ను నిర్వహిస్తున్నట్లు ప్రకటించింది అమెజాన్​. రెండు రోజులపాటు విజయవంతంగా సాగిన 'ప్రైమ్​ సేల్' ముగిసిన మరునాడే ఈ ప్రకటన చేసింది. ఫ్రీడమ్​ సేల్​లో అనేక రకాల వస్తువులపై భారీ డిస్కౌంట్​లతో వినియోగదారులకు బంపర్​ ఆఫర్లు అందుబాటులో ఉంచనున్నట్లు తెలిపింది.

ఆగస్టు 11 వరకు సాగే ఈ సేల్​లో ప్రముఖ బ్రాండ్ మొబైల్​ఫోన్లు, ల్యాప్​టాప్​లు, టీవీలు, అమెజాన్ డివైసెస్​పై భారీ డిస్కౌంట్లు అందుబాటులో ఉంటాయని దిగ్గజ ఈ-కామర్స్ సంస్థ పేర్కొంది.

హెడ్​ఫోన్స్​, కెమెరా యాక్సెసరీస్​పై 70శాతం వరకు.. స్పీకర్స్,​ హోమ్​ ఆడియో డివైసెస్​పై 60శాతం వరకు డిస్కౌంట్ లభించనుంది. అలాగే ల్యాప్​లాప్​లను 30శాతం, ప్రింటర్లను 50శాతం, గేమింగ్​ యాక్సెసరీస్​ను 40శాతం డిస్కౌంట్​లతో విక్రయించనున్నట్లు అమెజాన్​ తెలిపింది.

ఫ్రీడమ్​ సేల్ సమయంలో ఎస్​బీఐ క్రెడిట్​ కార్డు వినియోగదారులకు రూ.1500 వరకు 10 శాతం తక్షణ​ డిస్కౌంట్​ లభించనుంది. దీని కోసం వారు కనీసం రూ.5వేలు విలువ చేసే వస్తువులు కొనుగోలు చేయాల్సి ఉంటుంది.

ఆగస్టు 6,7 తేదీలలో అమెజాన్​ ప్రైమ్ సేల్ జరిగింది.

ఇదీ చూడండి: ప్రపంచ కుబేరుల్లో ముకేశ్​ అంబానీ@4

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.