అస్ట్రాజెనెకా, ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలు అభివృద్ధి చేసిన కరోనా టీకా కొవిషీల్డ్‌ను నెల రోజుల్లోపే కెనడాకు పంపిస్తామని మనదేశంలో ఈ టీకాను తయారు చేస్తున్న సీరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (ఎస్ఐఐ) పేర్కొంది. "భారత్, భారత వ్యాక్సిన్ పరిశ్రమపై మీరు (కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో) చేసిన సానుకూల వ్యాఖ్యలకు కృతజ్ఞతలు. కెనడా నుంచి నియంత్రణపరమమైన అనుమతుల కోసం వేచిచూస్తున్నాం. నెలలోగా కొవిషీల్డ్ కెనడాకు వస్తుందని హామీ ఇస్తున్నాన"ని ఎస్ఐఐ సీఈఓ అదర్ పూనావాలా ట్వీట్ చేశారు.
కెనడా కోరినట్లు కరోనా టీకాల సరఫరాలో భారత్ తన వంతు సహాయం చేస్తుందని కెనడా ప్రధాన మంత్రికి మన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఫిబ్రవరి 10న హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. భారత్ ఇప్పటికే 229 లక్షల డోసుల కరోనా టీకాలను వివిధ దేశాలకు పంపిణీ చేసింది.
ఇదీ చదవండి : త్వరలో భారత అమ్ముల పొదిలోకి మరో క్షిపణి!