ETV Bharat / business

Adar Poonawalla: '2022 తొలినాళ్లలోనే భారత్​లో బూస్టర్​ డోస్'​ - సీరం ఇన్​స్టిట్యూట్​ ఆఫ్​ ఇండియా సీఈఓ

భారత్​లో టీకా డోసుల పంపిణీ వంద కోట్ల మైలురాయిన చేరిన క్రమంలో.. రానున్న రోజుల్లో మరింత వేగం పుంజుకుంటుందన్నారు సీరం ఇన్​స్టిట్యూట్​ ఆఫ్​ ఇండియా(serum institute of india news) సీఈఓ అదర్​ పునావాలా(Adar Poonawalla). వచ్చే ఏడాది ప్రారంభానికి బూస్టర్​ డోస్​ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని తెలిపారు.

Adar Poonawalla
అదర్​ పునావాలా
author img

By

Published : Oct 21, 2021, 9:17 PM IST

కరోనా టీకా(Corona vaccination) కార్యక్రమంలో 100 కోట్ల డోసుల పంపిణీ(India 100 crore vaccine) ఒక కీలక మైలురాయని సీరం ఇన్​స్టిట్యూట్ ఆఫ్ ఇండియా(serum institute of india news) సీఈఓ అదర్ పునావాలా(Adar Poonawalla) అన్నారు. రానున్న రోజుల్లో టీకా పంపిణీ వేగం మరింత పుంజుకుంటుందని విశ్వాసం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఓ జాతీయ మీడియాతో మాట్లాడిన ఆయన.. బూస్టర్ డోసు గురించి తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

వచ్చే ఏడాది ప్రారంభానికి బూస్టర్ డోసు(Booster dose) అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని పూనావాలా అన్నారు. 'నైతికంగా, మానవతా దృక్ఫథంతో ఆలోచిస్తే.. ప్రపంచ దేశాలకు మరీ ముఖ్యంగా ఆఫ్రికా దేశాలకు ముందుగా రెండు డోసుల టీకా అందాలి. ఆఫ్రికా మొత్తం కనీసం మూడు శాతం మందికి కూడా టీకాలు అందలేదు. ఇక్కడ మాత్రం రెండు డోసులు తర్వాత బూస్టర్ డోసు గురించి మాట్లాడుతున్నారు. అయితే వృద్ధులకు, ప్రమాదం పొంచి ఉన్నవారికోసం తగినన్నీ బూస్టర్ డోసులు అందుబాటులో ఉంచుతాం. అయితే యువకులు, ఆరోగ్యవంతుల విషయంలో మిగిలిన ప్రపంచం రెండు డోసులు పొందేవరకు వేచి ఉండాల్సి ఉంది' అని అదర్ అభిప్రాయపడ్డారు. ఇప్పుడున్న ఉత్పత్తి వేగంతో ఈ ఏడాది చివరి నాటికి రెండు డోసులు పొందిన వారి సంఖ్య మరింత పెరుగుతుందన్నారు.

అలాగే భారీ జనాభా గల భారత్‌ ఈ ఫీట్ సాధించడం వెనుక ఘనత ప్రధాని మోదీకే చెందుతుందన్నారు. 100 కోట్ల డోసుల పంపిణీ అతిపెద్ద మైలురాయే(Vaccine Milestone) అయినా.. ప్రజలు మాత్రం కొవిడ్ నియమాల విషయంలో ఏ మాత్రం అలసత్వం ప్రదర్శించవద్దని అభ్యర్థించారు.

ఇవీ చూడండి: చరిత్ర సృష్టించిన భారత్​.. టీకా పంపిణీ@100కోట్లు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.