కార్పొరేట్ దిగ్గజాలు ఉద్యోగుల పట్ల తమ బాధ్యతను చాటుకుంటున్నాయి. ఇందులో భాగంగా తమ ఉద్యోగులకు కరోనా టీకా కోసమయ్యే ఖర్చులను భరించేందుకు సిద్ధమవుతున్నాయి. ప్రముఖ వ్యాపార దిగ్గజం అదానీ గ్రూప్.. తమ ఉద్యోగులకు, వారి కుటుంబ సభ్యులకయ్యే కరోనా టీకా ఖర్చులను తిరిగి చెల్లిస్తామని వెల్లడించింది.
ఇదీ చదవండి:మస్క్, బెజోస్‌ను మించి అదానీ సంపద వృద్ధి!
"అదానీ సంస్థలో పనిచేసే ప్రతి ఉద్యోగి, వారి తల్లిదండ్రులతో పాటు టీకా తీసుకున్న కుటుంబ సభ్యులందరికీ సంబంధిత ఖర్చులను మేమే భరిస్తాం. ఈ అవకాశం ఇప్పటినుంచి ఏప్రిల్ 30 వరకు కల్పిస్తాం."
- విక్రమ్ టాండన్, మానవ హక్కుల ప్రధాన అధికారి- అదానీ గ్రూప్
దేశంలో కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు ప్రభుత్వం.. టీకా కార్యక్రమాన్ని మరింత వేగవంతం చేస్తోందని అదానీ గ్రూప్ తెలిపింది.
ఇదీ చదవండి: ఆ బ్యాంకు ఉద్యోగులకు ఉచితంగా కరోనా టీకా!