ETV Bharat / business

మీ చిన్నారికి బాల్​ ఆధార్​ కార్డ్​ చేయించారా? - baala aadhar latest news

చిన్న పిల్లల కోసం బాల్​ ఆధార్​ను తీసుకువచ్చింది భారతీయ ప్రత్యేక గుర్తింపు ప్రాధికార సంస్థ(యూఐడీఏఐ). నవజాత శిశువుల నుంచి అయిదేళ్ల లోపు చిన్నారులకు ఈ ప్రత్యేక నీలిరంగు కార్డును కార్డ్​ను ఇవ్వనుంది. దీని దరఖాస్తు ప్రక్రియ గురించి తెలుసుకోండి.

Aadhaar card for new born children
మీ చిన్నారికి బాల్​ ఆధార్​ కార్డ్​ చేయించారా?
author img

By

Published : Apr 3, 2021, 12:04 PM IST

ఆధార్.. ప్రతి భారతీయుని విశిష్ట గుర్తింపు. 12 అంకెలతో భారతీయ ప్రత్యేక గుర్తింపు ప్రాధికార సంస్థ(యూఐడీఏఐ) ఆధార్​ నంబర్​ను దేశంలోని ప్రతి ఒక్కరికీ అందిస్తుంది. ప్రస్తుతం ఈ సంస్థ చిన్నపిల్లల కోసం బాల్​ ఆధార్​ను తీసుకువచ్చింది. దీనితో నవజాత శిశువులకు కూడా ఆధార్​ కార్డును నమోదు చేసుకునే వీలు కలగనుంది. 5 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న చిన్నారులు నీలి రంగులో ఉండే 'బాల్ ఆధార్'ను పొందవచ్చని యూఐడీఏఐ తెలిపింది. చిన్నారి ఐదేళ్లు పూర్తి చేసుకుంటే ఆ కార్డ్​ చెల్లదని స్పష్టం చేసింది. ఆ కార్డును తిరిగి రీయాక్టివేట్​ చేయించుకోవడం తప్పనిసరి అని పేర్కొంది. ఇందుకుగానూ బయోమెట్రిక్ అవసరమని ట్వీట్‌ చేసింది.

బాల్​ ఆధార్​ కూడా పెద్దవాళ్లకు ఇచ్చే కార్డు లాంటిదే. చిన్నారికి ఆ కార్డు చేయించాలంటే తప్పనిసరిగా తల్లిదండ్రులు ఆధార్​ కేంద్రానికి వెళ్లి దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. ఐదేళ్ల కంటే తక్కువ వయసు ఉన్నవారి నుంచి ఎటువంటి బయోమెట్రిక్​ సమాచారాన్ని తీసుకోరు. వారికి కార్డుని ఉచితంగా అందిస్తారు. రీయాక్టివ్​ చేయించుకునే సమయంలో కచ్చితంగా వేలి ముద్రలు, ఫొటో, కనుబొమ్మలను స్కాన్​ చేస్తారు.

కావాల్సిన పత్రాలు ​..

  • చిన్నారి జనన ధ్రువపత్రం లేదా బడిలో చదివే పిల్లలు అయితే స్కూల్​ యాజమాన్యం ద్రువీకరించిన ఫొటో
  • తల్లిదండ్రుల ఆధార్​ కార్డు వివరాలు

అప్లై చేయడం ఎలా?

  • చిన్నారికి ఆధార్​ కార్డు నమోదు చేయించాలి అంటే ముందుగా దగ్గర లోని ఆధార్​ కేంద్రానికి వెళ్లాలి.
  • తల్లిదండ్రుల ఆధార్​ కార్డు వివరాలతో సహా చిన్నారి జనన ధ్రువ పత్రాన్ని తీసుకువెళ్లాలి.
  • ఐదేళ్ల కన్నా ఎక్కువ వయసు ఉన్న వారి నుంచి బయోమెట్రిక్​ను తీసుకుంటారు.
  • తల్లిదండ్రుల ఆధార్​తో పిల్లల ఆధార్​ను అనుసంధానం చేస్తారు.

చిన్న పిల్లల ఆధార్​ కార్డుకు ఎన్​రోల్​మెంట్​ చేసుకోవడం ఎలా ?

  • ముందుగా యూఐడీఏఐ వెబ్​సైట్​కి వెళ్లాలి.
  • ఆధార్​ కార్డ్​ రిజిస్ట్రేషన్​ లింక్​పై క్లిక్ చేయాలి.
  • చిన్నారి పేరు, తల్లిదండ్రుల ఫోన్​ నంబర్​, ఈమెయిల్​ ఐడీ లాంటివి అందులో పొందుపరచాలి.
  • వివరాలు నమోదు చేయడం పూర్తి కాగానే అక్కడ ఉండే ఫిక్స్​ అపాయింట్​మెంట్​ అనే బటన్​ను నొక్కాలి.

ఇదీ చూడండి: పాన్​-ఆధార్​ లింక్​ గడువు పొడిగింపు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.