ETV Bharat / business

'ఉద్యోగంలో వృద్ధికి రోబో సలహాలే బెటర్​'.. ఎక్కువ మంది ఆలోచన ఇదే!

ఉద్యోగంలో వృద్ధి చెందేందుకు మనుషుల కంటే రోబోలు ఇచ్చే సూచనలే(career advice) ఎంతో మేలు చేస్తున్నాయని ప్రపంచ వ్యాప్తంగా 82% మంది విశ్వసిస్తున్నారు. తమ భవిష్యత్తును నిర్మించుకోవటానికి టెక్నాలజీ సాయం తీసుకోవాలని 85% మంది భావిస్తున్నారు. ఓ అధ్యయనంలో ఈ విషయం వెల్లడైంది.

robots help in careers
రోబో సలహాలు
author img

By

Published : Nov 14, 2021, 7:50 AM IST

ఉద్యోగంలో పైకి రావాలని అందరికీ ఉంటుంది. దాని కోసం వారు చేయని ప్రయత్నమూ ఉండదు. నైపుణ్యాలు పెంచుకోవడం, తమ రంగాలకు చెందిన సీనియర్ల సలహాలు(career advice) తీసుకోవడం, అనుభవజ్ఞులను ఆశ్రయించడం, తెలిసిన వారి మద్దతు కోరడం... ఇలా అన్ని రకాల ప్రయత్నాలు చేస్తుంటారు. వీటికి ఇప్పుడు ఒక కొత్త మార్గం కనిపిస్తోంది. అదేమంటే... రోబోల సహాయం తీసుకోవడం. ఆశ్చర్యంగా ఉన్నా... ఇదే నిజం. కరోనా మహమ్మారి తెచ్చిన అనూహ్యమైన మార్పుల్లో ఇది ఒకటి. అగ్రశ్రేణి ఐటీ కంపెనీ ఒరాకిల్‌ కార్పొరేషన్‌, వర్క్‌ప్లేస్‌ ఇంటెలిజెన్స్‌ అనే హెచ్‌ఆర్‌ రీసెర్చ్‌ అడ్వైజరీ సంస్థతో కలిసి నిర్వహించిన అధ్యయనంలో(Ai at work oracle) ఈ విషయం వెల్లడైంది. 'ఏఐ ఎట్‌ వర్క్‌'(Ai at work oracle) అనే పేరుతో వెల్లడించిన ఈ అధ్యయన నివేదికలో అత్యంత ఆసక్తికరమైన అంశాలెన్నో ఉన్నాయి. దీని ప్రకారం.. ఉద్యోగంలో వృద్ధి చెందేందుకు మనుష్యుల కంటే రోబోలు ఇచ్చే సూచనలే ఎంతో మేలు చేస్తున్నాయని ప్రపంచ వ్యాప్తంగా 82% మంది విశ్వసిస్తున్నారు. తమ భవిష్యత్తును నిర్మించుకోవటానికి టెక్నాలజీ సాయం తీసుకోవాలని 85% మంది భావిస్తున్నారు.

మనదేశంతో పాటు జర్మనీ, ఫ్రాన్స్‌, నెదర్లాండ్స్‌, యూకే, సింగపూర్‌, జపాన్‌, కొరియా, ఆస్ట్రేలియా, చైనా, యూఏఈ, యూఎస్‌, బ్రెజిల్‌కు చెందిన ఉద్యోగుల అభిప్రాయాలతో ఈ అధ్యయనాన్ని(Ai at work oracle) నిర్వహించారు. ఇందులో మనదేశానికి చెందిన 1,032 మంది పాల్గొన్నారు.

ఈ నివేదికలో ఇంకేం ఉందంటే...

  • ప్రపంచ వ్యాప్తంగా ఉద్యోగాల తీరుతెన్నులపై కొవిడ్‌ మహమ్మారి ప్రభావం ఇంకా ఉన్నట్లు 80% మంది భావిస్తున్నారు. ఎదుగూ బొదుగూ లేకుండా ప్రస్తుత ఉద్యోగాల్లో చిక్కుకుపోయామని 75% మంది, కేరీర్‌ను మార్చుకోవటానికి ఎన్నో అడ్డంకులు ఎదురవుతున్నాయని 76% చెబుతున్నారు.
  • వచ్చే ఏడాది కాలంలో ఉద్యోగ మార్పు కోరుకుంటున్నట్లు 83 శాతం మంది స్పష్టం చేశారు. వ్యక్తిగత జీవితాలను పూర్తిగా మార్చుకోవాలని 93 శాతం భావిస్తున్నారు.
    'కృత్రిమ మేధ' ద్వారా తమ భవిష్యత్తును నిర్మించుకోవాలని భావిస్తున్నట్లు మనదేశానికి చెందిన 97% మంది చెప్పారు. ఇదే అభిప్రాయాన్ని బ్రెజిల్‌లో 95%, యూఏఈలో 96%, చైనాలో 98%, కొరియాలో 92%, సింగపూర్‌లో 92% మంది వెలిబుచ్చారు.
  • మనుషుల కంటే రోబోలు ఇచ్చే సలహాలే బాగున్నాయని మనదేశానికి చెందిన వారు భావిస్తున్నారు. రోబో సూచనలకు అనుగుణంగా వ్యవహరిస్తే నైపుణ్యాలను అనూహ్యంగా పెంచుకునే అవకాశం ఉందని 46 శాతం మంది నమ్ముతున్నారు.
  • ఉద్యోగం, కెరీర్‌కు సంబంధించిన సందేహాలకు రోబోలు వెంటనే సమాధానాలు ఇస్తున్నాయని సగం మంది విశ్వసిస్తున్నారు. అంతేగాక తమ నైపుణ్యాలకు అనువైన ఉద్యోగాన్ని రోబోలు వెంటనే వెతికి పెట్టగలవని భావిస్తున్నారు.

వృత్తిలో ఎదగాలి...

కరోనా మహమ్మారి ప్రపంచ వ్యాప్తంగా ఉద్యోగుల జీవితాలను ఎంతగానో నష్టపరచింది. ఈ నేపథ్యంలో అందరిలో వృత్తి/ ఉద్యోగంలో ఎదుగుదల, విజయం సాధించటం అంటే ఏమిటి?, వ్యక్తిగత జీవితానికి జరుగుతున్న నష్టాన్ని ఎలా పూడ్చుకోవాలి... అనే ఆలోచనలు రేకెత్తుతున్నాయి. వృత్తి/ఉద్యోగం, వ్యక్తిగత జీవితాన్ని సమన్వయ పరచటం ఎలా? అనేది ఇప్పుడు తమ ప్రాధామ్యాల్లో ఒకటిగా మారినట్లు వివిధ దేశాల్లో ఉద్యోగులు స్పష్టం చేస్తున్నారు. ఎప్పుడు, ఎక్కడ పనిచేయాలనే స్వేచ్ఛ ఎంతో అవసరమని భావిస్తున్న ఉద్యోగుల సంఖ్య 49 శాతం ఉన్నట్లు ఈ సర్వేలో వెల్లడైంది. వృత్తిలో ఉన్నత స్థానానికి చేరడమే వచ్చే ఏడాదిలో తమ ప్రధాన లక్ష్యమని సగానికి పైగా అభిప్రాయపడ్డారు.

ఇవీ చూడండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.