ETV Bharat / business

దేశంలో 90 శాతం ఉద్యోగులకు ఆదాయ గండం!

author img

By

Published : Jun 11, 2020, 11:26 AM IST

కరోనా కారణంగా తలెత్తిన సంక్షోభంతో దేశవ్యాప్తంగా 80 శాతం ఉద్యోగుల ఆదాయంపై ప్రభావం పడిందని ఓ సర్వే వెల్లడించింది. రానున్న రోజుల్లో ఇది మరింత పెరగొచ్చని వెల్లడించింది. బీమా దిగ్గజం 'జెనరాలీ' చేసిన ఈ సర్వేలోని మరిన్ని విషయాలు ఇలా ఉన్నాయి.

corona impact on Income
ఉద్యోగుల ఆదాయానికి కరోనా గండి

కొవిడ్‌-19 సంక్షోభం నేపథ్యంలో దాదాపు 80 శాతం భారతీయ ఉద్యోగులు ఆదాయ నష్టాన్ని చవిచూశారని ఒక నివేదిక పేర్కొంది. ఇక భవిష్యత్‌లో మరిన్ని కోతలకు 90 శాతానికి పైగా సిద్ధంగా ఉన్నట్లు అంతర్జాతీయ బీమా దిగ్గజం 'జెనరాలీ' నివేదికలో తెలిపింది. ఇక వచ్చే కొన్ని నెలల్లో సగానికి పైగా ఆదాయం కోల్పోయే ప్రమాదం ఉందని స్వయం ఉపాధి పొందుతున్న వారు అంచనా వేస్తున్నారు.

కొవిడ్‌-19 సమయంలో వినియోగదారు సెంటిమెంట్‌లపై 22 దేశాల్లో ఈ సంస్థ అధ్యయనం చేసింది. భారత్‌లో ఫ్యూచర్‌ గ్రూప్‌తో కలిసి జెనరాలీ సంయుక్త సంస్థను నిర్వహిస్తోంది. అంతర్జాతీయ మార్కెట్‌ పరిశోధనా సంస్థ ఎపిఫానీ ద్వారా భారత్‌లో జెనరాలీ అధ్యయనం చేపట్టింది.

నివేదికలోని అంశాలు ఇలా..

  • కరోనా కారణంగా తలెత్తిన పరిస్థితుల వల్ల ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. భవిష్యత్‌ అనిశ్చితి నేపథ్యంలో కలతచెందుతున్నారు. కుటుంబాలను సంరక్షించుకునేందుకు ఎక్కువ మంది భయపడుతుండగా, ఆర్థిక నష్టాలు ఇందుకు తోడవుతున్నాయి.
  • భారతీయ ఉద్యోగుల్లో సగం మంది వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ (ఇంటి నుంచి పని) చేస్తున్నారు. ఇదే పద్ధతి మరికొన్ని నెలలు కొనసాగే అవకాశం ఉంది. కార్యాలయంలో ఎంత సమయం పనిచేస్తున్నారో.. ఇంటి నుంచి సైతం అంతే సమయం పనిచేస్తున్నారు.
  • ఆదాయం నష్టంతో ఉపశమనం కావాలని 95 శాతం మంది ఉద్యోగులు కోరుకుంటున్నారు. 53 శాతం ప్రభుత్వం నుంచి సాయాన్ని ఆశిస్తున్నారు. 60 శాతం మంది సేవింగ్స్‌, పెట్టుబడులను వెనక్కి తీసుకునేందుకు సిద్ధపడుతున్నారు. ఇక 39 శాతం మంది కుటుంబ సభ్యుల సాయాన్ని కోరుతున్నారు. మరోవైపు యాజమాన్యాలు ఉపశమనం కల్పించాల్సిందిగా 40 శాతం మంది అభిప్రాయపడ్డారు.
  • భారీ నగరాల్లో నివసిస్తున్న 30 శాతం మంది, కొవిడ్‌-19 జాతీయ విపత్తుగా భావిస్తున్నారు. వచ్చే కొన్ని నెలల్లో ఈ సంక్షోభం మరింత పెరగొచ్చని మరో 30 శాతం మంది అంచనా వేస్తున్నారు.
  • శారీరక, మానసిక, సాంఘిక, ఆర్థిక పరిస్థితులపై కరోనా ప్రభావం చూపుతోందని ప్రతి 10 మంది భారతీయుల్లో నలుగురు భావిస్తున్నారు. ముఖ్యంగా పట్టణాల్లో నివసిస్తున్న వారు ఆరోగ్యంపై భయపడుతున్నారు.

ఇదీ చూడండి:వరుసగా ఐదో రోజు పెరిగిన చమురు ధరలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.