ETV Bharat / business

జీవిత బీమాకే 70 శాతం మిలీనియల్స్​ మొగ్గు

మిలినీయల్స్‌.. సాంకేతికతపై పట్టు ఉండే తరం. ఇలాంటి వారిలో అత్యధిక శాతం మంది జీవిత బీమాను తీసుకోవడానికి ఆసక్తిని కనబరుస్తున్నారు. ఇటీవల అసోచామ్‌ చేసిన సర్వే కూడా ఈ విషయాన్ని తెలిపింది. 70శాతం మంది ఈ తరం వారు జీవిత బీమా వైపే మొగ్గుచూపుతున్నట్లు వెల్లడించింది. వీరు జీవిత బీమా తీసుకోవటానికి గల కారణాలు ఏంటి? సాధారణంగా జీవిత బీమా ఎందుకు తీసుకోవాలి?

life insurance
జీవిత బీమాకే 70 శాతం మంది మిలీనియల్స్​ మొగ్గు
author img

By

Published : Sep 2, 2020, 10:30 AM IST

జీవిత బీమా ఎంత అవసరమో కరోనా వల్ల చాలా మందికి తెలియవచ్చింది. దీంతో బీమాలు తీసుకుంటున్న వారి సంఖ్య పెరుగుతోంది. అయితే మిలీనియల్స్.. జీవిత బీమాపై ఎక్కువ ఆసక్తి కనబరుస్తున్నట్లు తెలుస్తోంది. అసోచామ్‌ ఇటీవల చేసిన సర్వేలో కూడా ఇదే తేలింది. 70 శాతం మంది మిలీనియల్స్‌ జీవిత బీమాను తీసుకునేందుకు మొగ్గుచూపుతున్నట్లు ఆ సర్వే తేల్చింది.

బీమాపై ఇటీవల ఎక్కువ అవగాహన వచ్చింది. డిజిటలైజేషన్‌తో ప్రతి ఒక్కరికి బీమాకు సంబంధించిన సమాచారం అందుబాటులో ఉంటుంది. పలు రకాల అంకురాలు కూడా బీమాకు సంబంధించిన సమాచారాన్ని.. సాంకేతికను ఉపయోగించే వారికి మరింత దగ్గర చేశాయి.

సాధారణంగా మిలీనియల్స్‌కు సాంకేతికతపై పట్టు ఎక్కువగా ఉంటుంది. ఆన్‌లైన్‌ ద్వారా బీమా రంగంలో చాలా మార్పులు వచ్చాయి. ఆన్‌లైన్‌లో సులభంగా పాలసీ తీసుకునేందుకు వీలు ఉంటోంది. అయితే వీరు జీవిత బీమా తీసుకునేందుకు వివిధ కారణాలున్నాయి.

కొనుగోలు సులభం..

ప్రస్తుతం చాలా మందికి ఇంటర్నెట్‌ వాడకంపై అవగాహన ఉంది. ఇంటర్నెట్‌ వాడకం మిలీనియల్స్‌కైతే చాలా సులభం. ఆన్‌లైన్‌ ద్వారా సౌకర్యవంతంగా పాలసీ తీసుకోవచ్చు. పాలసీని ఎంచుకొని ఆన్‌లైన్‌ పేమెంట్‌ చేసుకోవచ్చు. నెప్ట్‌, ఐఎమ్‌పీఎస్‌, వ్యాలెట్‌ పేమెంట్లలో ఏదో ఒకదానిని ఎంచుకోవచ్చు. ఆన్‌లైన్‌ పేమెంట్‌ సురక్షితమైనది కూడా.

జీవిత బీమా తీసుకునే సమయంలో డాక్యుమెంటేషన్‌ ప్రక్రియ చాలా సులభం. గుర్తింపు, వేతనం సహా మరికొన్ని ఆధారాలు సమర్పిస్తే సరిపోతుంది. సమస్యలు లేకుండా జీవిత బీమా తీసుకోవచ్చు.

తక్కువ ప్రీమియం రేట్లు..

ప్రజలు జీవిత బీమా పాలసీని తీసుకునేందుకు ప్రధాన కారణం... ప్రీమియం తక్కువగా ఉండటం. తక్కువ మొత్తంతో ఎక్కువ కవరేజీ పొందవచ్చు. దీని వల్ల జీవిత బీమా చాలా ప్రాముఖ్యతను సంతరించుకుంది. అన్ని కంపెనీల పాలసీలను పోల్చిచూసుకోవటం ప్రస్తుత రోజుల్లో చాలా సులభమైంది. ఆన్‌లైన్‌లో ప్రీమియానికి సంబంధించిన పూర్తి సమాచారం తెలుసుకోవచ్చు.

ఆర్థిక లక్ష్యాలను సాధించుకోవటం..

వ్యక్తిగతంగా, కుటుంబపరంగా నిర్దేశించుకున్న ఆర్థిక లక్ష్యాలను సాధించేందుకు నిధుల కొరత రాకూడదు. సరైన ఆర్థిక ప్రణాళిక ద్వారా దీన్ని సాధించవచ్చు. మనం లేని పక్షంలో కూడా ఆర్థిక లక్ష్యాలను సాధించేందుకు వీలుగా పెట్టుబడులు చేసుకోవాలి. దీనికి సరైన మార్గం జీవిత బీమా తీసుకోవటం. చాలా మంది మిలీనియల్స్‌ దీన్ని అర్థం చేసుకొని జీవిత బీమా ఫోర్ట్‌ఫోలియోలో ఉండే విధంగా చూసుకుంటున్నారు.

రిటర్న్స్‌కు హామీ..

కొన్ని జీవిత బీమా పాలసీలపై ముందే నిర్ణయించిన మేరకు రిటర్న్స్‌కు హామీ ఉంటుంది. పాలసీ మెచ్యురిటీ తర్వాత కనీస మొత్తాన్ని తీసుకోవచ్చు. మెచ్యురిటీ ప్రయోజనాలు, పెట్టుబడికి భద్రత, అనుకోని సంఘటనలు జరిగినప్పుడు ఆర్థిక దీమా… ఇలా మూడు ప్రయోజనాలను జీవిత బీమా అందిస్తుంది.

పన్ను ప్రయోజనాలు..

జీవిత బీమా పాలసీల ద్వారా పన్ను ప్రయోజనాలు కూడా పొందవచ్చు. ఐటీ చట్టం సెక్షన్‌ 80 సీ, డీ ప్రకారం పన్ను ఆదా చేసుకోవచ్చు. ఆదాయంతో పాటు పొదుపును దృష్టిలో ఉంచుకొని కూడా జీవిత బీమా తీసుకోవచ్చు.

ఉచిత బీమా సలహా..

బీమాకు సంబంధించి అన్ని సందేహాలను నివృత్తి చేసేందుకు బీమా కంపెనీలు మేనేజర్‌ను ఏర్పాటుచేస్తున్నాయి. ఆన్‌లైన్‌ లో ఈ విషయానికి సంబంధించిన సమాచారాన్ని పొందవచ్చు. ఈ సదుపాయం ద్వారా పాలసీ గురించి పూర్తి అవగాహన కోసం వీరిని సంప్రదించవచ్చు. తక్కువ సమయంలో బీమాపై స్పష్టత పొందవచ్చు. ఎప్పుడైనా ఉపయోగించుకునేందుకు వీలుగా… కస్టమర్‌ కేర్‌ సదుపాయం కూడా అందుబాటులో ఉంటుంది.

ఈ నేపథ్యంలో భవిష్యత్​పై భద్రత, మంచి రిటర్న్స్​ వస్తున్నాయి కాబట్టి.. చాలా మంది జీవిత బీమా పాలసీలు తీసుకోవడానికి ఇష్టపడుతున్నారు.

ఇదీ చూడండి: మార్క్​ను వెనక్కి నెట్టి మూడో స్థానానికి మస్క్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.