2022 ఫిబ్రవరిలో 5G స్పెక్ట్రమ్ వేలం ఉండవచ్చని కేంద్ర టెలికాం శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. అవసరమైతే వచ్చే ఏడాది జనవరిలోనే.. వేలం ప్రక్రియను పూర్తి చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు ఆయన చెప్పారు. టెలికాం రంగంలో కీలక సంస్కరణలకు శ్రీకారం చుట్టిన కేంద్రం ఆటోమేటిక్ రూట్‌లో 100 శాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి ఎఫ్డీఐ(FDI)లకు అనుమతిస్తూ నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి పేర్కొన్నారు. అప్పుల్లో కూరుకుపోయిన టెలికాం రంగానికి ఊరటనిచ్చేలా ఏజీఆర్(AGR) బకాయిలపై 4ఏళ్ల మారటోరియం ప్రకటించినట్లు వివరించారు.
ఇకపై టెలికామేతర ఆదాయాలను ఏజీఐర్ నుంచి మినహాయించేందుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపిందన్నారు. టెలికాం రంగంలో కేంద్రం తెచ్చిన సంస్కరణలు ఇప్పుడున్న సంస్థలు నిలదొక్కుకునేందుకు ఉపకరించడమే కాకుండా విస్తృత పోటీకి దారితీస్తుందన్నారు. కేంద్రం నిర్ణయాల వల్ల టెలికాం రంగంలో కొన్ని కంపెనీలకు నగదు కొరత తీరుతుందని ఆశిస్తున్నట్లు మంత్రి చెప్పారు. ఈ సంస్కరణలపై టెలికాం సంస్థలు హర్షం వ్యక్తం చేసినట్లు వివరించారు.
మరిన్ని సంస్కరణలు తేనున్నట్లు తెలిపిన కేంద్ర మంత్రి తద్వారా మరికొన్ని కొత్త కంపెనీలు టెలికాం రంగంలో వస్తాయన్నారు.
ఇవీ చదవండి: