ETV Bharat / business

భారత్‌లో 51 శాతం తగ్గిన ఉద్యోగ నియామకాలు

author img

By

Published : Jul 7, 2020, 5:05 AM IST

కరోనా లాక్​డౌన్ కాలంలో దేశంలో ఉద్యోగ నియామకాలు 51 శాతం తగ్గాయని ఇన్​డీడ్​ అనే ఉద్యోగ వెబ్​సైట్​ తన నివేదికలో వెల్లడించింది. ప్రపంచ దేశాలతో పోలిస్తే భారత్​ మెరుగ్గానే ఉందని ఈ నివేదిక స్పష్టం చేసింది.

job placements
ఉద్యోగ నియామకాలు

కరోనా వైరస్‌, లాక్‌డౌన్‌ పరిణామాల నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక కార్యకలాపాలు నిలిచిపోయాయి. ఫలితంగా ఉద్యోగాల కోతలు, పని చేసిన రోజులకే వేతనం లాంటి నిర్ణయాలను కంపెనీలు అమలు చేస్తున్నాయి. కొన్ని సంస్థలైతే కొంతకాలం పాటు నియామకాలను వాయిదా వేసుకుంటున్నాయి.

అయితే నియామకాల విషయంలో ప్రపంచంలోని చాలా దేశాలతో పోలిస్తే భారత్‌లోని పరిస్థితి మెరుగ్గా ఉందని ఓ నివేదిక పేర్కొంది. ప్రముఖ ఉద్యోగ వెబ్​సైట్​ ఇన్‌డీడ్‌ రూపొందించిన ఈ నివేదిక ప్రకారం.. మార్చి రెండో వారం వరకు ప్రపంచవ్యాప్తంగా నియామకాల ధోరణి ఏడాది క్రితం ఉన్నట్లుగానే ఉందని తెలిపింది.

మార్చి తర్వాత..

అయితే మార్చి రెండో అర్ధభాగం తర్వాత నియామకాలు నెమ్మదించాయని పేర్కొంది. ఏప్రిల్‌, మేలోనూ ఇదే పరిస్థితి కొనసాగిందని వెల్లడించింది. ఈ నివేదిక ప్రకారం 2019తో పోలిస్తే జూన్‌ మధ్యనాటికి భారత్‌లో నియామకాలు 51 శాతం తగ్గాయి.

ప్రపంచవ్యాప్తంగా చూస్తే.. బ్రిటన్‌లో నియామకాలు 60 శాతం, మెక్సికో సహ మరికొన్ని ఐరోపా దేశాల్లో 61 శాతం చొప్పున క్షీణించాయి. అమెరికాలో 29%, సింగపూర్‌లో 32%, ఆస్ట్రేలియాలో 42% మేర నియామకాలు తగ్గాయి.

ఇదీ చూడండి: ఐఐటీలో ఇంజినీరింగ్‌ సీటు సాధించాలంటే..!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.