ETV Bharat / business

ఆ ప్రాజెక్టులకు రూ.4లక్షల కోట్లు అదనపు ఖర్చు - The Ministry of Statistics today news

కరోనా మహమ్మారి కారణంగా దేశవ్యాప్తంగా అనేక ప్రాజెక్టు పనులు వాయిదాపడుతున్నాయని కేంద్ర గణాంకాల శాఖ తెలిపింది. ఫలితంగా ప్రాజెక్ట్​ నిర్వహణ వ్యయం భారీ స్థాయిలో పెరుగుతోందని పేర్కొంది.

401 infra projects show cost overruns of Rs 4.02 lakh crore
ప్రాజెక్టు పనుల్లో జాప్యం.. భారీగా పెరుగుతోన్న వ్యయం
author img

By

Published : Jul 19, 2020, 3:01 PM IST

దేశవ్యాప్తంగా అనేక మౌలిక వసతుల ప్రాజెక్టుల్లో కరోనా కారణంగా జాప్యం జరుగుతోందని కేంద్ర గణాంకాల మంత్రిత్వశాఖ ఓ నివేదికలో వెల్లడించింది. రూ.150 కోట్లు, అంతకంటే ఎక్కువ ఖర్చుతో నిర్మిస్తున్న సుమారు 401 ప్రాజెక్టులకు వైరస్​ సంక్షోభం ప్రభావం చూపిందని తెలిపింది.

ఈ కారణంగా మెుత్తం 1692 ప్రాజెక్టుల్లో 401 ప్రాజెక్టుల నిర్మాణానికి నిర్దేశించిన ఖర్చు పెరుగుతోందని స్పష్టం చేసిన మంత్రిత్వశాఖ.. మరో 552 ప్రాజెక్టులు పనులు ఆలస్యం కానున్నాయని పేర్కొంది. ఫలితంగా రూ. 4 లక్షల కోట్లు అదనపు ఖర్చవుతోందని చెప్పింది.

ఇవీ లెక్కలు..

1692 ప్రాజెక్టుల నిర్దేశిత ఖర్చు రూ. 20,75,0212.70 కోట్లు కాగా.. ఆలస్యం కారణంగా అంచనా వ్యయం పెరిగి రూ. 24,78,0016.45 లకు చేరవచ్చని నివేదికలో తెలిపింది. ఈ ప్రాజెక్టుల్లో 2020 జనవరి నాటికి రూ. 10,97,0604.64 కోట్లు ఖర్చు కాగా.. ఈ విలువ ప్రాజెక్టుల అంచనా వ్యయంలో 44.29 శాతమని తెలిపింది. మరో 824 ప్రాజెక్టులు అసలు ప్రారంభమే కాలేదని నివేదికలో పేర్కొంది.

ఇదీ చదవండి: 'కరోనా,జీడీపీ, చైనాపై భాజపా చెప్పేవన్నీ అబద్ధాలే'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.