ETV Bharat / business

'దేశంలో 30% డ్రైవింగ్​ లైసెన్స్​లు నకిలీవే'

దేశంలో చాలా మంది సులభంగా డ్రైవింగ్​ లైసెన్స్​లు పొందుతున్నట్లు కేంద్ర రవాణాశాఖ మంత్రి నితిన్​ గడ్కరీ వెల్లడించారు. ఈ కారణంగా దేశంలో ప్రస్తుతం దాదాపు 30 శాతం నకిలీ డ్రైవింగ్​ లైసెన్స్​లు ఉన్నట్లు తెలిపారు.

nearly every third driver in the country has a fake licence
ప్రతి ముగ్గురిలో ఒకరితో నకిలీ లైసెన్స్
author img

By

Published : Feb 15, 2021, 10:51 AM IST

Updated : Feb 15, 2021, 1:12 PM IST

దేశంలో దాదాపు 30 శాతం డ్రైవింగ్ లైసెన్స్​ నకిలీవేనని కేంద్ర రవాణాశాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ వెల్లడించారు. నాగ్​పుర్​లో జాతీయ భద్రతా ప్రచారంలో ఆదివారం పాల్గొన్న గడ్కరీ ఈ విషయం వెల్లడించారు.

'బోగస్​ లైసెన్స్​లు పొందటం ఇప్పుడు చాలా సులభమైంది. డబ్బులివ్వడం ద్వారా ఎవరో ఒకరు ఆర్​టీఓ ఆఫీస్​ నుంచి డ్రైవింగ్​ లైసెన్స్​ ఇప్పిస్తున్నారు. ఇప్పుడు ఆధార్తో​ అనుసంధానంతో నకిలీ లైసెన్స్​లకు అడ్డుకట్ట పడుతుంది.' అని పేర్కొన్నారు.

'దేశంలో 30 శాతం డ్రైవింగ్​ లైసెన్స్​లు నకిలీవే'

ఫాస్టాగ్‌కు సంబంధించిన గడువును పొడిగించేది లేదని కూడా నితిన్‌ గడ్కరీ స్పష్టంచేశారు. వాహన యజమానులు వెంటనే ఫాస్టాగ్‌ను తీసుకోవాలని సూచించారు. టోల్‌ప్లాజాల వద్ద ఎలక్ట్రానిక్‌ పద్ధతిలో ఫీజు చెల్లించేందుకు ఉద్దేశించిన ఫాస్టాగ్‌ తప్పనిసరి గడువు ఈ నెల 15తో ముగుస్తున్న నేపథ్యంలో ఈ విషయంపై స్పష్టతనిచ్చారు.

ఇదీ చదవండి:'ఫాస్టాగ్‌ లేకపోతే డబుల్ రుసుం‌ చెల్లించాలి'

Last Updated : Feb 15, 2021, 1:12 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.