ETV Bharat / business

'టపాసులు లేకుండానే దీపావళి.. మెజార్టీ ప్రజల ఆలోచన ఇదే!' - ఇండియా

రానున్న దీపావళి పండుగపై లోకల్​ సర్కిల్స్(local circle survey)​ అనే సంస్థ ఓ సర్వే నిర్వహించింది. 'ఈ దీపావలికి టపాసులు కాల్చుతున్నారా?' అని ప్రశ్నించింది. సర్వేలో 28వేల మంది పాల్గొనగా.. మెజారిటీ ప్రజలు టపాసులు కాల్చబోమని చెప్పారు.

crackers ban in india
దీపావళి
author img

By

Published : Nov 2, 2021, 5:26 PM IST

దేశవ్యాప్తంగా మెజారిటీ(ప్రతి మూడు కుటుంబాల్లో రెండు) ప్రజలకు ఈ దీపావళికి(diwali 2021 date in india) అసలు టపాసులు పేల్చే ఆలోచనే లేనట్టు ఓ సర్వేలో తేలింది. ఇందుకు.. నిషేధంతో(crackers ban in india) టపాసులు అందుబాటులో లేకపోవడం, కాలుష్యం సహా అనేక కారణాలున్నట్టు సర్వే స్పష్టం చేసింది.

దేశవ్యాప్తంగా 371 జిల్లాల్లోని 28వేలమందిపై లోకల్​సర్కిల్స్ అనే సంస్థ ఈ సర్వే(local circles survey) నిర్వహించింది. వీరిలో 63శాతం మంది పురుషులు కాగా.. 37శాతం మంది మహిళలు. 41శాతం మంది టైర్​-1, 33శాతం మంది టైర్​-2 నగరాలకు చెందిన వారున్నారు.

"ఈ దీపావళికి టపాసులు కాల్చుతున్నారా? అని సర్వేలో మేము ప్రశ్నించాము. 45శాతం మంది ఎలాంటి టపాసులు కాల్చమని చెప్పారు. 15శాతం మంది హరిత టపాసులు కాలుస్తామన్నారు. 11శాతం మంది.. టపాసులు కాకుండా, చిచ్చుబుడ్లు వంటివి కాలుస్తామని సమాధానమిచ్చారు. కేవలం 6శాతం మంది.. ఎప్పుడూ కాల్చే విధంగానే ఈసారీ టపాసులు కాలుస్తామని చెప్పారు. నిషేధం అమల్లో ఉండటం వల్ల తమకు వేరే ఆప్షన్​ లేదని 5శాతం మంది అభిప్రాయపడ్డారు."

-- లోకల్​సర్కిల్స్

సర్వేలోని ముఖ్యాంశాలు..

  • టపాసులపై నిషేధానికి 42శాతం కుటుంబాలు మద్దతిచ్చాయి. 53శాతం కుటుంబాలు నిషేధాన్ని వ్యతిరేకించాయి. కాలుష్యానికి టపాసులకు సంబంధం లేదన్నాయి.
  • 42శాతం కుటుంబాలు.. టపాసులు పేల్చడాన్ని అనవసరమైన ఖర్చుగా భావిస్తున్నాయి. కాలుష్యం పెరగడం కూడా ఓ కారణమన్నాయి.
  • చాలా ఇళ్లల్లో.. కరోనా కారణంగా కుటుంబసభ్యులు మరణించారు. మరికొందరు కరోనా నుంచి కోలుకుంటున్నారు. అందుకే ఈసారి పండుగను జరుపుకోకూడదని నిర్ణయించుకున్నారు.
  • జీవనోపాధి కోల్పోవడం వల్ల అనేకమంది ఆర్థిక సంక్షోభంలో జీవిస్తున్నారు. అందువల్ల వీరు పండుగకు దూరంగా ఉంటున్నారు.
  • జాతీయస్థాయిలో టపాసులపై నిషేధం విధించాలని 28శాతం మంది అభిప్రాయపడ్డారు. కాలుష్యం అధికంగా ఉన్న రాష్ట్రాలు నిషేధాజ్ఞలు విధిస్తే సరిపోతుందని 8శాతం మంది తెలిపారు. 6శాతం మంది జిల్లాస్థాయిలో నిషేధం విధించాలన్నారు.

ఇదీ చూడండి:- 'రూ.44వేల కోట్లిస్తా.. పేదల ఆకలి ఎలా తీర్చుతారో చెప్పండి'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.