తీవ్ర ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్న జెట్ ఎయిర్వేస్కు మరో దెబ్బతగిలే అవకాశం ఉంది. వేతనాలు చెల్లించనందుకు నిరసనగా విధులను బహిష్కరించాలని 'నేషనల్ ఏవియేటర్స్ గిల్డ్(ఎన్ఏజీ)' సంఘానికి చెందిన 1100 మంది జెట్ ఎయిర్వేస్ పైలట్లు యోచిస్తున్నారు. మార్చి నెల జీతాలను సంస్థ ఇప్పటి వరకు వారికి చెల్లించలేదు.
ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు
విధుల బహిష్కరణపై ఇంతవరకు తుది నిర్ణయం తీసుకోలేదని ఎన్ఏజీ తెలిపింది. రేపు ఉదయం భేటీ అయి కార్యాచరణపై సమాలోచన చేస్తామని ప్రకటించింది.
ఆందోళనల వాయిదా పర్వం
జెట్ ఎయిర్వేస్లో మొత్తం 16వందల మంది పైలట్లు ఉన్నారు. ఇందులో 1100 మంది ఎన్ఏజీలో సభ్యులని ఆ సంఘం చెబుతోంది.
మొదట ఏప్రిల్ 1 నుంచి నిరసన చేపట్టాలని అనుకున్నారు పైలట్లు. కొత్త యాజమాన్యానికి సమయం ఇవ్వాలన్న ఉద్దేశంతో దీనిని ఏప్రిల్ 15కు వాయిదా వేసుకున్నారు. గత నెల నుంచి ఎస్బీఐ నేతృత్వంలోని కొత్త కన్సార్టియమ్ జెట్ యాజమాన్య బాధ్యతలను నిర్వహిస్తోంది.
కొనసాగుతున్న విమానాల రద్దు
పశ్చిమ దేశాలకు వెళ్లే విమానాల రద్దును ఈ నెల 16వ తేదీ వరకు పొడిగించినట్లు జెట్ ఎయిర్వేస్ ప్రకటించింది. ఆసియాన్, సార్క్ దేశాల్లో సేవలను నిరవధికంగా రద్దు చేసింది. చెన్నై నుంచి పారిస్, అమెరికాలోని టొరంటో సర్వీసుల రద్దును కూడా పొడిగించింది.