ETV Bharat / budget-2019

మహిళా సాధికారతకు సర్కారు చేయూత: నిర్మల - జన్​ధన్ ఖాతా

స్వయం సహాయక బృందాలకు వడ్డీ రాయితీ పథకాన్ని దేశవ్యాప్తంగా అమలు చేస్తామని ఆర్థికమంత్రి నిర్మలాసీతారామన్ పేర్కొన్నారు. ప్రతి సంఘంలోని ఒక మహిళలకు ముద్ర యోజన ద్వారా లక్ష రూపాయల వరకు రుణ సౌకర్యం కల్పిస్తామని ప్రకటించారు.

మహిళా సాధికారతకు చేయూత: నిర్మలా సీతారామన్​
author img

By

Published : Jul 5, 2019, 2:31 PM IST

Updated : Jul 5, 2019, 4:29 PM IST

దేశ అభివృద్ధిలో మహిళలకు భాగస్వామ్యం కల్పించడానికి, వారికి సౌకర్యాలు కల్పించి, ప్రోత్సహించడానికి ఓ కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్​ తెలిపారు.

మోదీ 2.0 ప్రభుత్వంలో మొదటిసారి బడ్జెట్ ప్రవేశపెట్టిన నిర్మలా సీతారామన్​ మహిళలకు వరాలు ప్రకటించారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో మహిళలది ప్రత్యేక పాత్ర అని కొనియాడారు.

స్వయం సహాయక బృందాలకు వరాలు

"మహిళా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించడానికి ఈ ప్రభుత్వం కృషి చేస్తోంది. ముద్ర, స్టాండప్ ఇండియా ద్వారా, స్వయం సహాయక సంఘాల ద్వారా మహిళలకు సహకారం అందిస్తోంది. మహిళా పారిశ్రామిక వేత్తలను మరింతగా ప్రోత్సహించడానికి... మహిళా స్వయం సహాయక సంఘాలకు వడ్డీ రాయితీ పథకాన్ని... దేశవ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ అమలు చేయాలని నేను ప్రతిపాదిస్తున్నాను. అలాగే జన్​ధన్ ఖాతా ఉన్న ప్రతి మహిళలకు రూ.5 వేలు ఓవర్​డ్రాఫ్ట్ సౌకర్యం కల్పిస్తాం. అంతే కాకుండా ముద్ర యోజన ద్వారా సంఘంలోని ఒక మహిళకు లక్ష రూపాయల వరకు రుణసౌకర్యం కల్పిస్తాం."
-నిర్మలా సీతారామన్​, ఆర్థికమంత్రి

మహిళలకు కృత్రిమ మేథ, రోబోటిక్స్, త్రీడీ ప్రింటింగ్​ టెక్నాలజీల్లో శిక్షణ ఇప్పిస్తామని నిర్మలా సీతారామన్​ తెలిపారు. సంప్రదాయ చేతివృత్తులవారిని, సృజనశీలురను ప్రపంచ మార్కెట్​తో అనుసంధానించడానికి ప్రభుత్వం కృషి చేస్తుందని, ఆయా రంగాల వారు జీఐ, పేటెంట్​ హక్కులు పొందడంలో సహకారం అందిస్తుందని ఆర్థికమంత్రి తెలిపారు.

మహిళా సాధికారతకు చిహ్నంగా ప్రస్తుత లోక్​సభలో 78 మంది మహిళా ఎంపీలు ఉన్నారని నిర్మలా సీతారామన్ అన్నారు. మహిళల ప్రోత్సాహంతోనే గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో వెలుగులు విరజిమ్ముతాయని ఆమె పేర్కొన్నారు.

ఇదీ చూడండి: బడ్జెట్​ 19: ఆదాయ పన్ను పరిమితి యథాతథం

Intro:Body:

ee

Conclusion:
Last Updated : Jul 5, 2019, 4:29 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.