ఉత్తర్‌ప్రదేశ్ రాజధాని లఖ్‌నవూలో పర్యటించిన ఏఐసీసీ అధ్యక్షులు రాహుల్ గాంధీ... ప్రధాని మోదీపై తీవ్ర విమర్శలు చేశారు. దేశానికి కాపలాదారుడినని చెప్పుకునే మోదీ... దేశంలోని అన్ని రాష్ట్రాల సంపదను దోచుకుంటున్నారని విమర్శించారు. ఉత్తరప్రదేశ్‌లో ప్రస్తుత అవినీతి ప్రభుత్వాన్ని గద్దెదించి కాంగ్రెస్ పార్టీ పగ్గాలు చేపట్టే వరకు తనతో పాటు ప్రియాంక గాంధీ, సింథియాలు విశ్రాంతి తీసుకోరని రాహుల్ ప్రకటించారు.
![undefined](https://s3.amazonaws.com/saranyu-test/etv-bharath-assests/images/ad.png)
"ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల ధనాన్ని దేశ కాపలాదారు (మోదీ)దోచుకుంటున్నారు. రక్షణ రంగ సొమ్మునూ అపహరించారు. దేశాన్ని రక్షిస్తున్నానన్న నరేంద్రమోదీ ఫ్రాన్స్ ప్రభుత్వంతో ఒప్పందం చేసుకొని మరీ రూ.30 వేల కోట్లను అనిల్ అంబానీకి దోచిపెట్టారు. దేశానికి ఉత్తరప్రదేశ్ గుండె లాంటిది. రెండు సంవత్సరాలుగా రాష్ట్రంలో అన్యాయం జరుగుతోంది. అన్యాయంపై పోరాడటానికే ప్రియాంకాగాంధీ, సింథియాలను కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శులుగా నియమించా. లోక్‌సభ ఎన్నికల్లో ఎక్కువసీట్లు గెలవడం, ఉత్తర్‌ప్రదేశ్‌లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడమే వారి లక్ష్యం."
- రాహుల్‌గాంధీ, కాంగ్రెస్ అధ్యక్షులు