ETV Bharat / briefs

గుర్తు పేరు ఉంది... బొమ్మలేదు! ప్రచారం ఎలా? - lokasaba

పార్లమెంట్​ ఎన్నికల పోలింగ్​కు కేవలం నాలుగు రోజులు మాత్రమే ఉంది. అభ్యర్థుల లిస్ట్​లో గుర్తుల పేర్లు మాత్రమే రాశారు. కానీ గుర్తుల బొమ్మలు ప్రచురించలేదు. ఇలా ఉంటే మేము ఎలా ప్రచారం చేసుకోవాలి? ఇంతకీ మా గుర్తేంటి?

పసుపు రైతులు
author img

By

Published : Apr 7, 2019, 7:12 PM IST

నిజామాబాద్​ పార్లమెంట్​ స్థానానికి నామినేషన్లు వేసిన పసుపు రైతులు ఎన్నికను వాయిదా వేయాలని డిమాండ్ చేశారు. కేవలం నాలుగు రోజుల్లోనే ఎన్నికలు ఉండటం వల్ల... ఎలా ప్రచారం చేసుకోవాలని ప్రశ్నించారు. జగిత్యాలలో ఏర్పాటు నమూనా పోలింగ్ కేంద్రాన్ని రైతు అభ్యర్థులు పరిశీలించారు. కేంద్రం బయట ఏర్పాటు చేసిన బోర్డులో అభ్యర్థుల, గుర్తుల పేర్లు మాత్రమే ఉన్నాయని.. చిహ్నాల బొమ్మలు లేవని ఆవేదన వ్యక్తం చేశారు. గుర్తుల రూపాలు కేటాయించకుండా ఎన్నికల అధికారులు చుక్కలు చూపెడుతున్నారని వాపోయారు. ప్రచారానికి సమయం లేనందున ఎన్నికను వాయిదా వేయాలని కోరారు.

రైతు వ్యతిరేక పార్టీలకు బుద్ధి చెప్పండి!

అన్ని ప్రభుత్వాలు రైతులను మోసం చేశాయని మండిపడ్డారు. సమస్యల పట్ల ఆందోళన చేస్తే తెరాస సర్కార్​ అరెస్టులు చేయించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీలన్నీ రైతులకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నాయన్నారు. మధ్యప్రదేశ్​లో భాజపా ప్రభుత్వం ఆరుగురిని పొట్టన పెట్టుకుందన్నారు. రైతు వ్యతిరేక పార్టీలకు ఓటు వేయకుండా... 178 మందిలో ఎవరికో ఒకరికి వేస్తే... తమ ఉద్యమాన్ని సమర్థించిన వారు అవుతారని స్పష్టం చేశారు. ఎంపీ కవిత పసుపు బోర్డు కోసం ప్రయత్నించానని చెప్పి మభ్యపెట్టేందుకు చూస్తోందని విరుచుకుపడ్డారు.

ఇక్కడ ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో గుర్తు పేరు క్యాన్ అని​ ఉంది. కానీ బొమ్మ లేదు. ఇప్పుడు నేను ఎట్ల ప్రచారం చేసుకోవాలి? అది పాల క్యానా? నీళ్ల క్యానా? ఏదని చెప్పాలి. నాకు కేటాయించిన గుర్తు నాకే తెల్వకపోతే ఇక ఓటు వేయమని ఎలా అడగాలి? ఎన్నికల అధికారులు దీనికి సమాధానం చెప్పాలి.
------- ఓ రైతు ఆవేదన

9న ఆర్మూర్​లో బహిరంగ సభ..

ఈనెల 9న ఆర్మూరు​లో రైతు ఐక్య సభ నిర్వహిస్తున్నట్లు అన్నదాతలు తెలిపారు. ఈవీఎంల ద్వారా తమకు న్యాయం జరగదని వాపోతున్నారు. బ్యాలెట్ పద్ధతిలో ఎన్నికలను నిర్వహించాలని కోరుతున్నారు. పసుపు బోర్డు ఏర్పాటు చేసేంత వరకు తమ పోరాటం ఆగదని స్పష్టం చేశారు.

పసుపు రైతులు

ఇవీ చూడండి: ఎన్నికల ప్రచారానికి గడువు ఇంకా 48 గంటలే..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.