ఈనెల 25న రాష్ట్రవ్యాప్తంగా అన్ని ఆర్టీసీ డిపోల మందు టీఎంయూ ఆధ్వర్యంలో ధర్నా చేస్తామని ఆ సంఘం ప్రధాన కార్యదర్శి అశ్వథ్తమ తెలిపారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని లేకుంటే సర్కారు అధికారులతో సమాన వేతనాలు ఇవ్వాలన్నారు. సకల జనుల సమ్మెలో పాల్గొన్న కార్మికుల బకాయిలు ఇప్పటికీ చెల్లించలేదని తెలిపారు. 30 శాతం ఆర్టీసీ బస్సులు పనికిరాకుండా పోయాయని వాటి స్థానంలో కొత్త బస్సులు కొనుగోలు చేయాలన్నారు. ప్రభుత్వం నియమించిన నిపుణుల సంఘం కాలయాపన చేస్తోందని మండిపడ్డారు.
ఇవీ చూడండి: ప్రగతిభవన్ ముందు దంపతుల ఆత్మహత్యాయత్నం