హైదరాబాద్ నడి బొడ్డులో జరుగుతున్న డీజీల్ మాఫియా గుట్టు సామాజిక మాధ్యమంలో బట్టబయలయ్యింది. జీహెచ్ఎంసీ వాహనాల నుంచి డీజిల్ దొంగలించి అబిడ్స్ బొగ్గులకుంట వాటర్ వర్క్స్‌లో పేమెంట్ ట్యాంకర్ వాహనాలకు అమ్ముతున్న వీడియోలను స్థానికులు చిత్రీకరించారు. గత కొంత కాలంగా ఈ దందా నడుస్తుందంటూ ఆరోపించారు. మున్సిపల్ కార్పొరేషన్ వాహన డ్రైవర్లు ఎవరైనా గమనిస్తారని వాహనాన్ని బొగ్గుల కుంటలోని కార్యాలయానికి దూరంగా నిలిపి అందులో నుంచి డీజిల్‌ను తీసి లీటర్‌కు 15 రూపాయల తక్కువ ధరకు విక్రయిస్తున్నారని స్థానికులు చెబుతున్నారు. గత కొన్ని నెలలుగా ఈ మాఫియా సాగుతున్నా... అధికారులు చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారన్నారు. ఈ విషయం తమ దృష్టికి రాలేదని... ఒకవేళ ఇలాంటి చర్యలకు ఎవరైనా పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని వాటర్ వర్క్స్ మేనేజర్ మధుసూదన్ చారి తెలిపారు.
ఇవీ చూడండి: భట్టి దీక్షతో బయటపడ్డ విభేదాలు