ఆదిలాబాద్‌లోని బెల్లూరి అయ్యప్పస్వామి ఆలయంలో విషుఖని పూజ మహోత్సవం కన్నుల పండువగా నిర్వహించారు. మళయాళ సంప్రదాయ ప్రకారం... కేరళలో వచ్చిన తొలిపంటలతో చేసిన నైవేద్యాన్ని అయ్యప్పకు సమర్పించారు. పదునెట్టాంబడిపై జ్యోతులు వెలిగించి పరవశించిపోయారు. శ్రీకృష్ణుని లీలా మహత్యంలో మారే కాలచక్రంలో విషు మహోత్సవం... మనుషుల దైనందిన జీవితాలను ప్రభావితం చేస్తుందని ఆలయ అర్చకులు తెలిపారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఆలయ నిర్వాహకులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.
ఇదీ చదవండిః జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలపై శిక్షణా కార్యక్రమం