విజయవాడ సమీపంలోని శారదాపీఠ ఉత్తరాధికారి సన్యాస స్వీకార మహోత్సవం ఘనంగా జరిగింది. కృష్ణాతీరంలో గణపతి సచ్చిదానంద స్వామి ఆశ్రమంలో ఉత్తరాధికారిగా కిరణ్కుమార్ శర్మ దీక్ష స్వీకరించారు. అనంతరం స్వాత్మానందేంద్ర సరస్వతిగా నామకరణం చేశారు. ఈ కార్యక్రమానికి తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేసీఆర్, జగన్ ముఖ్య అతిథిలుగా హాజరయ్యారు. 2024 నాటికి పీఠాధిపతిగా స్వాత్మానందేంద్రకు పూర్తిగా బాధ్యతలు అప్పగిస్తామని స్వరూపానంద స్వామి తెలిపారు. ఈ కార్యక్రమానికి ఇద్దరు సీఎంలు రావడం సంతోషంగా ఉందని స్వరూపానంద స్వామి అన్నారు.
ఇవీ చూడండి: శారదాపీఠ ఉత్తరాధికారి సన్యాస స్వీకార మహోత్సవం