గవర్నర్ సమక్షంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ముఖ్యమంత్రులు చర్చించుకోవటం వాంఛనీయ పరిణామమని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. తెలుగు రాష్ట్రాల సీఎంలు సోదరభావంతో మెలగటం ఇరువురికీ లాభదాయకమని చెప్పారు. ఏయూ వైవీఎస్‌మూర్తి ఆడిటోరియంలో ఇండస్ట్రీ అకాడమీ ఇంటరాక్షన్ సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. కేంద్రం జోక్యం అవసరం లేకుండా ఇరురాష్ట్రాల సమస్యలు పరిష్కరించుకో గలిగితే ఎంతో మంచిదన్నారు. గడిచిన ఐదేళ్లలో తాను అదే ఆకాంక్షను వ్యక్తం చేశానని తెలిపారు. కారణం ఏదైనా అది కార్యరూపం దాల్చలేదని ఆవేదన వ్యక్తం చేశారు. జగన్, కేసీఆర్ చర్చల ద్వారా వివాదాల పరిష్కారం కోసం ప్రయత్నించడం అభినందించాల్సిన విషయమని పేర్కొన్నారు. ఇంకా కొలిక్కిరాని అంశాలను సత్వరం పరిష్కరించుకోవాలి సూచించారు.
ఇదీ చూడండి : 'ఇక ఏడాదంతా నిండుకుండలా రిజర్వాయర్లు'