భూగర్భ జలాలు అడుగంటడం వల్ల రాష్ట్రంలో ఏటా కూరగాయల సాగు గణనీయంగా తగ్గుతోంది. పంటలు ఎండిపోతుండడం... దిగుబడులపై తీవ్ర ప్రభావం చూపుతోంది. పొరుగు రాష్ట్రాల నుంచి కూరగాయల దిగుమతి తగ్గిపోవడం వినియోగదారులపై ధరాభారం పెరుగుతోంది.
సాగు పెంచేందుకు క్రాప్ కాలనీలు!
రాష్ట్రంలో కూరగాయల సాగు విస్తీర్ణం పెంచేందుకు ఇప్పటికే క్రాప్ కాలనీల పేరిట రైతులకు రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సాహకాలు అందిస్తోంది. హైదరాబాద్‌తో పాటు వరంగల్, కరీంనగర్, నిజామాబాద్, ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలో క్రాప్ కాలనీలను ప్రోత్సహించేందుకు ఐదేళ్ల వ్యవధిలో రూ.985 కోట్లు అవసరమవుతాయని ఉద్యానశాఖ అంచనా వేస్తోంది. పంట కాలనీ ప్రణాళిక రూపకల్పన బాధ్యతను ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయానికి అప్పగించింది.
కూరగాయల సాగు విస్తీర్ణం, దిగుబడిలో దేశంలో తెలంగాణ 15వ స్థానంలో ఉంది. ఇంకా మెరుగైన ఫలితాలు సాధించేందుకు ప్రభుత్వం దృఢ సంకల్పంతో ఉంది. క్రాప్ కాలనీలతో కూరగాయల సాగు పెంచేందుకు కృషి చేస్తోంది. వీటి ద్వారా రైతన్నకు, వినియోగదారుడికి భారం తగ్గించడమే దీని లక్ష్యం.
ఇవీ చూడండి: అమ్మో కూర'గాయం'... వాటి కంటే పచ్చళ్లు నయం