సౌదీ అరేబియాలో యాజమాని చేత చిత్రహింసలు ఎదుర్కొంటున్న కరీంనగర్ వాసి వీరయ్య ఆచూకీని గుర్తించినట్లు యుఏఈలోని భారత రాయబార కార్యాలయం వెల్లడించింది. తెరాస కార్యనిర్వహక అధ్యక్షుడు కేటీఆర్ చొరవతో బాధితుడిని కలిసినట్లు తెలిపిన రాయబార సిబ్బంది... స్వదేశానికి రప్పించేందుకు చర్యలు చేపట్టినట్లు పేర్కొంది.
రంజాన్ తర్వాత భారత్‌కు అప్పగిస్తామని ఒంటెల యాజమాని హామీ ఇచ్చినట్లు రాయబార కార్యాలయం తెలిపింది. వీరయ్య తిరిగి ఇంటికి చేరుకుంటున్నందుకు హర్షం వ్యక్తం చేసిన కేటీఆర్... సౌదీలోని భారత రాయబారి కార్యాలయానికి కృతజ్ఞతలు తెలిపారు.
ఇవీ చూడండి ; 'వారి అర్హత, ప్రవర్తనలో ఎలాంటి లోపం లేదు'