ETV Bharat / briefs

ఇరాన్​- అమెరికా మధ్య ఎందుకింత ఉద్రిక్తత? - US-IRAN WAR

అమెరికా-ఇరాన్ యుద్ధానికి కాలుదువ్వుతున్నాయి. ఏ దేశం వెనక్కి తగ్గడం లేదు. ట్యాంకర్ల పేల్చివేత, డ్రోన్ల కూల్చివేత, సైబర్​దాడులు, దళాల మోహరింపు, హెచ్చరికలు, రెచ్చగొట్టే మాటలతో ఇరు దేశాలు కత్తులు దూసుకుంటున్న తరుణంలో.. ఏ క్షణాన యుద్ధం సంభవిస్తుందోనని ప్రపంచం మొత్తం ఆందోళన చెందుతోంది.

ఇరాన్​-అమెరికా మధ్య ఉద్రిక్తతలకు కారణమేంటి?
author img

By

Published : Jun 22, 2019, 8:15 PM IST

ఇరాన్​-అమెరికా మధ్య ఉద్రిక్తతలకు కారణమేంటి?

అమెరికా-ఇరాన్​ మధ్య యుద్ధం జరగనుందా..? ప్రస్తుతం ఏం జరుగుతోంది... ఇరు దేశాల మధ్య ఇంత ఉద్రిక్తతలకు దారి తీసిన పరిస్థితులేంటి ...? ప్రస్తుతం ప్రపంచమంతా ఇదే చర్చ. ఈ రెండు దేశాల మధ్య యుద్ధం జరిగితే యావత్ ప్రపంచంపై ఆ ప్రభావం పడుతుంది. చమురు ధరలు భారీగా పెరుగుతాయి. అసలు ఈ రెండు దేశాల మధ్య గొడవ ఎప్పుడు మొదలైంది? ఆంక్షల నుంచి ప్రస్తుత పరిస్థితులకు దారి తీసిన పరిణామాలేంటి...?

అలా మొదలైంది..

అమెరికా- ఇరాన్​ల మధ్య జగడం గతేడాది మొదలైంది. 2015లో జరిగిన ఇరాన్​ అణు ఒప్పందం నుంచి బయటికి రావాలని 2018, మే8న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​ నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయంతో ఇరు దేశాల మధ్య మాటల యుద్ధం ప్రారంభమైంది. ట్రంప్​ అభిప్రాయాన్ని చాలా దేశాలు తీవ్రంగా విమర్శించాయి. అయినా ఆయన వెనక్కి తగ్గలేదు. గతేడాది ఆగస్టు 7న ఇరాన్​పై ఆంక్షల దాడిని ప్రారంభించింది అగ్రరాజ్యం. ఆర్థిక పరంగా ఇరాన్​ను​ దెబ్బతీయాలని నిశ్చయించుకుంది.

చమురుపై ఆంక్షలు

ఇరాన్​ ఆర్థిక వనరులను దెబ్బతీసే చర్యలను గతేడాది నవంబర్​ 5న ప్రారంభించింది అమెరికా. ఆ దేశం నుంచి చమురు ఎగుమతులను నిషేధిస్తూ నిర్ణయం తీసుకుంది. ఎవరైనా ఇరాన్​ నుంచి ముడి చమురు కొంటే ఆ దేశంపైనా ఆంక్షలు విధిస్తామంటూ హెచ్చరికలు జారీ చేసింది. ఈ చర్యలతో ఇరాన్​ కష్టాలు తీవ్రమయ్యాయి. ప్రపంచ దేశాలపైనా ఈ ప్రభావం పడి.. చమురు ధరలు పెరగడం ప్రారంభించాయి. అయితే కొన్ని దేశాలకు మినహాయింపునిచ్చింది అమెరికా.
ఇరాన్​కు చెందిన శక్తిమంతమైన 'ఇస్లామిక్​ రివల్యూషనరీ గార్డ్​ క్రాప్'​ సంస్థను ఈ ఏడాది ఏప్రిల్​ 8న నిషిద్ధ ఉగ్రవాద సంస్థ జాబితాలో అమెరికా చేర్చడం వల్ల పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారాయి.

ఇరాన్​ నుంచి ముడి చమురు కొనుగోలు చేసేందుకు భారత్​, చైనా, జపాన్​ లాంటి దేశాలకు ఇచ్చిన మినహాయింపును అమెరికా మే 5న ఎత్తేసింది. ఈ చర్య వల్ల ఇరాన్​ ఆర్థిక వ్యవస్థ మరింత దిగజారిపోయింది. చర్చలకు తాము సిద్ధమంటూనే.. ఆంక్షలను క్రమంగా అమెరికా పెంచుకుంటూ పోయింది. ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు అప్పటి నుంచి తారస్థాయికి చేరాయి. ​

చమురు నౌకలపై దాడి...

ఒమన్​ సమీపంలోని హొర్ముజ్​ జలసంధి వద్ద చమురు నౌకలపై దాడి జరగడం... ఇరాన్​, అమెరికా మధ్య ఉద్రిక్తతలను మరింత పెంచింది. ఈ దాడులపై రెండు దేశాలు పరస్పరం ఆరోపణలు చేసుకున్నాయి. ఆందోళనకర పరిస్థితుల మధ్య చమురు ధరలకు ఒక్కసారిగా రెక్కలొచ్చాయి.

నిఘా డ్రోన్​ కూల్చివేత..

ఇరాన్​ గగనతలంలోకి అక్రమంగా ప్రవేశించిన అమెరికా నిఘా డ్రోన్​ను ఇటీవల ఇరాన్​ కూల్చివేసింది. ఈ చర్యతో ఇరు దేశాల మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి.
చర్చలు జరుపుతామంటూనే.. ఆంక్షలు విధిస్తూ.. యుద్ధానికి సిద్ధమవుతోంది అమెరికా. మరోవైపు ఇరాన్​ సైతం తగ్గడం లేదు. డ్రోన్​ కూల్చివేత సహా సైబర్​ దాడులతో అగ్రరాజ్యానికే సవాలు విసురుతోంది. తమ వైపు ఒక బుల్లెట్​ ప్రయోగించినా... అమెరికా మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరిస్తోంది.

ఇదీ చూడండి: 'ఒక్క బుల్లెట్​ ప్రయోగించినా.. మూల్యం చెల్లిస్తారు'

Southampton (England), June (ANI): Supporters of team India and Afghanistan arrived at The Rose Bowl stadium today. India will take on Afghanistan in the 28th match of Cricket World Cup 2019. The cricket fanatics from both the countries cheered for their team. As this match will be a tough nut to crack for Afghanistan cricket team as the 'Men in Blue' seem to be invincible this World Cup. The weather of Southampton is also clear for the interesting match.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.