ETV Bharat / briefs

నిజామాబాద్ జిల్లాలో రెండు సార్లు ఓటు వేసిన ఓటర్లు

నిజామాబాద్ జిల్లాలో ఓ పోలింగ్ కేంద్రంలో కొందరు ఓటర్లు రెండు సార్లు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. పొరపాటును గుర్తించిన అధికారులు మరోసారి వారితో ఓటేయించారు.

author img

By

Published : May 6, 2019, 8:34 PM IST

రెండు సార్లు ఓటు వేసిన ఓటర్లు

నిజామాబాద్ జిల్లాలోని ఓ పోలింగ్ కేంద్రంలో కొందరు ఓటర్లు రెండు సార్లు ఓటేశారు. నవిపేట్​లోని 26వ పోలింగ్ కేంద్రంలో ఈ సంఘటన జరిగింది. పోలింగ్ కేంద్రంలో నవిపేట్-1 ఎంపీటీసీ స్థానానికి బదులు ఇదే మండలంలోని నాలేశ్వర్ గ్రామానికి చెందిన ఎంపీటీసీ బ్యాలెట్ పత్రాలు వచ్చాయి. 12 మంది ఓటర్లు గమనించకుండా ఇవే బ్యాలెట్ పత్రాలపై ఓటేసి వెళ్లిపోయారు. ఓటరు పత్రాలు మారిపోయినట్లు ఓ వ్యక్తి గుర్తించి పోలింగ్ అధికారులకు తెలిపారు. వెంటనే 12 మంది ఈ విధంగా ఓటేసినట్లు గుర్తించిన అధికారులు... వారిని వెనక్కి రప్పించి మరోసారి ఓటేయించారు. వీరంతా రెండు సార్లు ఓటు హక్కు వినియోగించుకున్నారు. బ్యాలెట్ పత్రంలో సీరియల్ నంబర్లు వరుసగా ఉండి, అభ్యర్థులు, స్థానం పేర్లు తప్ప మిగతా వివరాలన్నీ.. సరిగ్గా ఉండటం వల్ల అధికారులు గమనించలేకపోయారు. ఈ విధంగా చివరి గంటలో మాత్రమే వచ్చాయి. వెంటనే నాలేశ్వర్ పత్రాలపై ఓటేసిన వారిని తిరిగి రప్పించిన అధికారులు మరోసారి వారితో ఓటు వేయించారు.

రెండు సార్లు ఓటు వేసిన ఓటర్లు

ఇవీ చూడండి: బ్యాలెట్ పత్రాన్ని ఫొటో తీసి అరెస్ట్ అయ్యాడు

sample description
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.