రాష్ట్ర ఉత్తర మండల విద్యుత్ పంపిణీ సంస్థకు 2019 స్కాచ్ ఆర్డర్ ఆఫ్ మెరిట్ అవార్డు లభించింది. సంస్థ తరఫున టీఎస్ఎన్పీడీసీఎల్ సంచాలకులు వెంకటేశ్వరరావు, కార్యదర్శి వెంకటేశ్ దిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో స్కాచ్ గ్రూప్ ప్రతినిధుల నుంచి ఈ అవార్డును అందుకున్నారు. విద్యుత్ అంతరాయలను తగ్గించడం, విద్యుత్ సరఫరాను త్వరితగతిన పునరుద్ధరించడం.... మొదలైన అంశాలకు గానూ... సంస్థకు ఈ పురస్కారం దక్కింది. ఇంధన పొదువు, స్పాట్ బిల్లింగ్ పేమెంట్ మొదలైన అంశాల్లో మెరుగైన పనితీరు కనబరిచినందుకు గానూ 2015, 2017, 2018 సంవత్సరాల్లో టీఎస్ఎన్పీడీసీఎల్ ఈ అవార్డును గెలుచుకుంది. సీఎండీ గోపాలరావు కృషి, ఉద్యోగులు... సిబ్బంది నిరంతర శ్రమ ఫలితంగానే ఈ అవార్డు దక్కిందని సంస్థ సంచాలకులు తెలిపారు.
ఇవీ చూడండి: ఐదేళ్ల చిన్నారిపై అత్యాచారయత్నం