జపాన్ ఒసాకాలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, భారత ప్రధాని నరేంద్రమోదీ మధ్య ఫలవంతమైన చర్చలు జరిగాయని ఇవాంకా ట్రంప్ అన్నారు. 5-జీ, జాతీయ భద్రత, ఇరాన్ అంశాలపై ఇరువురు నేతలు చర్చించారని తెలిపారు.
అమెరికాకు... మిత్రదేశమైన భారత్‌ను అత్యంత కీలక వ్యాపార, భద్రతా భాగస్వామిగా అభివర్ణించారు ట్రంప్ ప్రధాన సలహాదారు, ఆయన కుమార్తె అయిన ఇవాంకా ట్రంప్. మహిళల ఆర్థిక సమస్యలపై ప్రధానంగా దృష్టి పెట్టారు ఆమె.
జపాన్‌లో జరిగిన జీ-20 సదస్సు సందర్భంగా... మోదీ, ట్రంప్ ప్రత్యేకంగా సమావేశం అయ్యారు. మోదీ రెండోసారి అధికార పీఠం ఎక్కిన తరువాత ఇరువురు నేతలు భేటీ కావడం ఇదే మొదటిసారి.
ఇవాంకా... ట్వీట్
జీ-20 శిఖరాగ్ర సదస్సు చివరి రోజు వైట్‌హౌస్‌లో ఇవాంకా ఓ వీడియో ట్వీట్ చేశారు. ట్రంప్, భారత ప్రధాని మోదీ, జపాన్ ప్రధాని షింజో అబేలతో వేర్వేరుగా జరిపిన ద్వైపాక్షిక చర్చల సంక్షిప్త సమాచారాన్ని చెప్పారు.
-
President Trump had a trilateral meeting with Prime Minister Modi and Prime Minister Abe, followed by a bilateral meeting with PM Modi. Here is the readout: pic.twitter.com/xE46ol5kqU
— The White House (@WhiteHouse) June 28, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
">President Trump had a trilateral meeting with Prime Minister Modi and Prime Minister Abe, followed by a bilateral meeting with PM Modi. Here is the readout: pic.twitter.com/xE46ol5kqU
— The White House (@WhiteHouse) June 28, 2019President Trump had a trilateral meeting with Prime Minister Modi and Prime Minister Abe, followed by a bilateral meeting with PM Modi. Here is the readout: pic.twitter.com/xE46ol5kqU
— The White House (@WhiteHouse) June 28, 2019
ఇదీ చూడండి: ట్రంప్-కిమ్ సాక్షిగా జవాన్లు, పాత్రికేయుల ఫైట్